షోల్లేక యూట్యూబ్ మీద ప‌డ్డ యాంక‌ర్లు

Update: 2020-05-04 05:45 GMT
సినిమాల షూటింగుల్లేవ్.. థియేట‌ర్లు ఓపెన‌య్యేదెపుడో క్లారిటీ లేనే లేదు. దీని ప‌ర్య‌వ‌సానం చాలా కోణాల్లో బ‌య‌ట ప‌డుతోంది. కార్మికులు నిర్మాత‌లు అనే తేడా లేకుండా అంద‌రిపైనా దీని ప్ర‌భావం ప‌డింది. ఉపాధి కోల్పోయి ఎంద‌రో అల్లాడుతున్నారు. అయితే టాలీవుడ్ పై ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్న చిన్నా చిత‌కా యాంక‌ర్ల స‌న్నివేశ‌మేమిటి?

అస‌లే లాక్ డౌన్ వ‌ల్ల ప్రెస్ మీట్లు లేవు.. ఆడియో ఫంక్ష‌న్లు అస‌లే లేవు. ప్రీరిలీజ్ వేడుక‌లు లేవు.. పైగా బుల్లితెర కార్య‌క్ర‌మాలకు చెక్ ప‌డిపోయింది. ఒక్కో కార్య‌క్ర‌మానికి వేలు ల‌క్ష‌ల్లో భ‌త్యం అందుకుని ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ కి అల‌వాటు ప‌డిపోయిన ఈ యాంక‌ర‌మ్మ‌ల్ని ఆదుకునేది ఎవ‌రు? ఇలాంట‌ప్పుడు సంపాద‌న ఎలా?  బెంజి కార్ నుంచి ప‌నోళ్ల మెయింటెనెన్స్ వ‌ర‌కూ ఎలా వేగేది?  మేక‌ప్ కాస్ట్యూమ్స్ అంటూ వాటికి పెట్టుబ‌డులు పెట్టాలంటే డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? ఇన్ని కోణాల్లో ఆరా తీస్తే.. పాపం సీనియ‌ర్ జూనియ‌ర్ అనే తేడా లేకుండా యాంక‌ర్లు అంతా చాలా ఇబ్బందుల్లోనే ఉన్నార‌ని తెలుస్తోంది.

లాక్ డౌన్ వ‌ల్ల పెద్ద యాంక‌ర్ల ప‌రిస్థితే ధీనంగా ఉంది. దీంతో చిన్న యాంక‌ర్లు కొత్త యాంక‌ర్లు ఇంకా తీవ్ర‌మైన‌ ఇబ్బందుల్లో కూరుకు పోయార‌ని తాజా సీన్ చెబుతోంది. చాలా మంది మీడియం రేంజు యాంక‌ర్లు షోల్లేక సొంతంగా యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుని ర‌న్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు ఇంట్లోనే ఉంటూ కాస్త పెద్ద రేంజు యూట్యూబ్ చానెళ్ల‌కు వ‌ర్క్ చేస్తున్నారు‌. వ‌ర్క్ ఫ్రం హోం ఆఫ‌ర్ల‌ను స‌ద్వినియోగం చేసుకుని కాలాన్ని నెట్టుకొచ్చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక అప్ క‌మింగ్ యాంక‌ర్లు అంతా యూట్యూబ్ చానెళ్ల‌పై ప‌డుతున్నారని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News