ఆఫర్ ఇస్తాం కమిట్మెంట్‌ ఇస్తావా.. షాకింగ్‌ విషయాలు బయట పెట్టిన హాట్ యాంకర్‌

Update: 2022-09-18 23:30 GMT
ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్ అనేది చాలా కామన్ విషయంగా మారిపోయింది. ప్రస్తుతం స్టార్స్ గా ఉన్న వారు... ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న వారు ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్‌ కౌచ్ గురించి మీడియాలో నిలిచారు. ఇప్పుడు బుల్లి తెర సెన్షేషన్‌.. సోషల్‌ మీడియా హాట్ బ్యూటీ విష్ణు ప్రియా కాస్టింగ్‌ కౌచ్ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆఫర్ల కోసం తాను ప్రయత్నిస్తుండగా ఒకరు ఇద్దరు తనతో అసభ్యంగా వ్యవహరించారని విష్ణు ప్రియ పేర్కొంది. హీరోయిన్ మెటీరియల్‌ అయినా కూడా విష్ణు ప్రియా కి ఆఫర్లు రాకపోవడంకు కారణం ఆమె కాస్టింగ్‌ కౌచ్ కు ఓకే చెప్పక పోవడం అని తాజా ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది.

హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తున్న విష్ణు ప్రియ తాజాగా ఒక వీడియో ఆల్బం లో నటించింది. ఆ వీడియో ఆల్బంలో అందాల ఆరబోతతో హీరోయిన్‌ కి ఈ అమ్మడు ఏ మాత్రం తక్కువ కాదని మరోసారి నిరూపించుకుంది. హీరోయిన్ గానే కాకుండా ఇలా ఐటెం సాంగ్స్ తో కూడా ఈమె మెప్పించగల సత్తా ఉన్న ఆర్టిస్టు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక కాస్టింగ్‌ కౌచ్‌ గురించి తాజా ఇంటర్వ్యూలో విష్ణు ప్రియా మాట్లాడుతూ.. ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు కోరిక తీర్చుతావా అంటూ ప్రశ్నించారని.. ఆ సమయంలో వారికి నో చెప్పానంటూ విష్ణు ప్రియ కామెంట్స్ చేసింది. ఆ సమయంలో తనను మానసికంగా కుంగదీసే విధంగా కొందరు ప్రయత్నించారని కూడా  ఈ హాట్‌ యాంకర్‌ ఆవేదన వ్యక్తం చేసింది.
Tags:    

Similar News