• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెయిడ్ చేసిన మహా సాయం

మెయిడ్ చేసిన మహా సాయం

By - Tupaki Desk
Update: 2018-04-10 04:39 GMT
రంగస్థలం మూవీలో రామ్ చరణ్ పాత్రకు ఎంతగా పేరు వచ్చిందో.. అలాగే ఆ సినిమాలోని ఇతర పాత్రలలో నటించిన అందరికీ బోలెడన్ని ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా హాట్ యాంకర్ ఇమేజ్ ఉన్న అనసూయ అయితే రంగమ్మత్త పాత్రలో ఇరగదీసేసింది. ఆ పాత్రను అనసూయ తప్ప వేరెవరూ పోషించినా న్యాయం జరిగేది కాదన్న స్థాయిలో పండించేసింది అనసూయ.

అయితే.. ఈ క్యారెక్టర్ గురించి తెలిసిన తర్వాత.. ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకున్న తర్వాత.. అందులో ఒదిగిపోవడం ఎలా అనే విషయం పై బోలెడంత మథనపడిందట అనసూయ. చివరకు ఆమెకు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. తన ఇంట్లో పని చేస్తున్న ఓ మెయిడ్ ది రాయలసీమ కాగా.. ఆమె ప్రవర్తనను మాటతీరును కొన్నిరోజుల పాటు పరిశీలిస్తూనే ఉందిట అనసూయ. చివరకు ఓ అంచనాకు వచ్చి.. అందుకు తగినట్లుగా సినిమాలో యాక్ట్ చేసి చూపిందట.

అనసూయ యాక్టింగ్ చూసి దర్శకుడు సుకుమార్ కూడా ఆశ్చర్యపోయాడట. తన పని సులభం అయిపోయింది అన్నాడట సుక్కు. మరోవైపు అనసూయకు కూడా ఆ పాత్రను మరింత సహజంగా నటించేందుకు.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు అలా మెయిడ్ రూపంలో సాయం చేసింది. రంగమ్మత్త రోల్ అంత అద్భుతంగా కుదరడం వెనక.. అలా మెయిడ్ చేసిన మహాసాయం ఉందని చెప్పింది అనసూయ.
Tags:    
  • Anasuya 
  • Rangasthalam Movie 
  • Telugu NEws 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS