ఫస్ట్‌ లుక్‌ః రౌడీ వాల్తేర్‌ శీనుగా అక్కినేని హీరో

Update: 2021-02-09 04:06 GMT
ఫస్ట్‌ లుక్‌ః రౌడీ వాల్తేర్‌ శీనుగా అక్కినేని హీరో
అక్కినేని హీరో సుమంత్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్ లు విడుదల చేశారు. మంజు యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న 'అనగనగా ఒక రౌడీ' సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుమంత్ లుక్ చాలా డిఫరెంట్‌ గా ఉంది. ఇప్పటి వరకు సుమంత్‌ ను ఎక్కువగా సాఫ్ట్‌ పాత్రల్లోనే చూడటం జరిగింది. మొదటి సారి లుంగీ ఎగ్గట్టి సీరియస్ లుక్‌ లో గుండుతో గడ్డం పెంచి ఒక రౌడీ లా సుమంత్‌ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

అయ్యప్ప మాల వేసి ఉన్న పాత్రలో సుమంత్‌ లుక్ చాలా యూనిక్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన కమర్షియల్ సక్సెస్ లేకుండానే కెరీర్‌ ను నెట్టుకు వస్తున్న సుమంత్‌ ఈ సినిమాతో సక్సెస్ ఏమైనా కొట్టేనా అంటూ అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సుమంత్‌ ఇకపై నెగటివ్ రోల్స్‌ చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వాల్తేర్‌ శీను పాత్రలో అనగనగా ఒక రౌడీ సినిమా లో సుమంత్‌ ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తాడో చూడాలి. సుమంత్‌ బర్త్‌ డే సందర్బంగా మా తరపున కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Tags:    

Similar News