డైరెక్టర్ వద్ద 3లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తారకరత్న.. కట్ చేస్తే!

ఇకపోతే ఈయనకు సంబంధించిన పలు విషయాలను తాజాగా దర్శకుడు సముద్ర చేసిన కామెంట్లు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.;

Update: 2025-12-13 05:32 GMT

సాధారణంగా దర్శకులు ఒక కథను తయారు చేసుకునేటప్పుడు.. ఆయా పాత్రలకు ఆయా హీరోలను లేదా సెలబ్రిటీలను అనుకొని మరే కథలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఆ కథలను ఆయా పాత్రలకు వినిపించినప్పుడు వారు కథ నచ్చి.. ఓకే చెబితే అడ్వాన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి అడ్వాన్స్ తీసుకున్న హీరోలు సడన్గా కాలం చేస్తే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. సరిగ్గా ఇప్పుడు అలాగే జరిగింది. తన సినిమాకు ఓకే చెప్పాడని మూడు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఆ డైరెక్టర్. కానీ విధి వెక్కిరించడంతో ఆ హీరో 22 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి గెలవలేక మృత్యువు వడిలోకే చేరిపోయి, సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టివేశారు. ఇక ఆయన ఎవరో కాదు స్వర్గీయ నందమూరి తారకరత్న.

స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా నందమూరి మోహన కృష్ణ - సీత దంపతుల వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఈయన.. ఒకే ఏడాది తొమ్మిది సినిమాలను మొదలుపెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో చిత్రాలు చేశారు. కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. అమరావతి సినిమాలో విలన్ గా నటించి నంది అవార్డును కూడా దక్కించుకున్నారు. అలాంటి ఈయన లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా మొదటి రోజే గుండెపోటు రావడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చేరి.. దాదాపు 22 రోజులపాటు మృత్యువుతో పోరాడి, 2023 ఫిబ్రవరి 18 మహాశివరాత్రి రోజున శివైక్యం పొందారు.

ఇకపోతే ఈయనకు సంబంధించిన పలు విషయాలను తాజాగా దర్శకుడు సముద్ర చేసిన కామెంట్లు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.అసలు విషయంలోకి వెళ్తే.. సింహరాశి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సముద్ర.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తారకరత్నతో తనకున్న అనుబంధం గురించి అలాగే తారకరత్న గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.

సముద్ర మాట్లాడుతూ.." తారకరత్నతో ఒక సినిమా చేయాలి అని గడ్డం బాగా పెంచమని చెప్పాను. నా సినిమాలో పాత్రకు తగ్గట్టుగా తారకరత్న సిద్ధం అయ్యారు. ఆ సినిమా కోసం నేను ముందుగా మూడు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఫోటో సెక్షన్ ఎప్పుడు పెట్టుకుందామని అడిగితే..యోగార్చన అయిపోయిన వెంటనే చేద్దామని చెప్పారు. కానీ అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ ఎమోషనల్ అయ్యారు సముద్ర. ఇక తనతో చాలా మంచి సంబంధం ఉంది అని ,అన్నయ్య అని పిలిచేవారు అని, ఎప్పుడైనా తారకరత్న ఎక్కడున్నారు అని అడిగితే ఇండస్ట్రీలో కూడా సముద్రాకి మాత్రమే తెలుసు అనేవాళ్లు. అంతలా నాకు తారకరత్నతో మంచి అనుబంధము ఉండేది అంటూ తెలిపారు.

ఇక తారకరత్న చనిపోయే ముందు రోజుల్లో తండ్రి మాట్లాడలేదని.. కానీ తన తండ్రితో మాట్లాడడం కోసం నేను సినిమాలను వంక పెట్టుకొని మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడే మాటలను తారకరత్న వినేవాడు అని చెప్పుకొచ్చారు..

ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా మాట్లాడుతూ.. తారకరత్నకు ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు రాలేదు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి కూడా బాగా సంపన్నరాలు. చనిపోయే ముందు సంవత్సరం కూడా ఒక విల్లా కొనుగోలు చేశాడు. ఇక ఎప్పుడూ కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తలేదు అంటూ తారకరత్న గురించి ఎన్నో తెలియని విషయాలను పంచుకున్నారు సముద్ర.

Tags:    

Similar News