OG బ్యూటీ కిల్లర్ ఫోజులు వైరల్
ప్రియాంక మోహనన్ పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటిగా కొనసాగుతోంది ఈ ప్రతిభావని.;
ప్రియాంక మోహనన్ పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటిగా కొనసాగుతోంది ఈ ప్రతిభావని. కన్నడ సినిమా `ఒంధ్ కథే హెళ్ల` (2019)తో సినీరంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో నాని `గ్యాంగ్ లీడర్` చిత్రం అదే ఏడాది విడుదలైంది. నేచురల్ స్టార్ సరసన ప్రియాంక నటనకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఈ యంగ్ ట్యాలెంటెడ్ బ్యూటీ సినీప్రయాణం అభిమానులకు సుపరిచితమే.
దక్షిణాది మూడు ప్రధాన భాషల్లో అగ్ర హీరోల సరసన ఈ బ్యూటీ నటిస్తోంది. తమిళనాట శివ కార్తికేయన్ సరసన డాక్టర్, డాన్ లాంటి భారీ సినిమాల్లో నటించింది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలోని భారీ చిత్రంలోను అవకాశం అందుకుంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఓజీలోను నటించింది. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో కన్మణి అనే పాత్రలో ప్రియాంక నటనకు మంచి గుర్తింపు దక్కింది.
ప్రియాంక లుక్ వైజ్ పూర్తిగా ట్రెడిషనల్. అసాధారణమైన ఎక్స్ పోజింగ్, గ్లామర్ ఎలివేషన్ కోసం అంతగా తపించదు ఈ బ్యూటీ. అనవసరమైన ఎలివేషన్ల కంటే నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇతర కథనాయికలలో లేని ఈ స్పెషల్ క్వాలిటీ ఇలాంటి ఠఫ్ కాంపిటీషన్ లోను అవకాశాలు కల్పిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇటీవల ప్రియాంక మోహనన్ సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. తాజాగా ఈ బ్యూటీ తనలోని గ్లామర్ సైడ్ ని పరిచయం చేయాలని భావించినా, దానిని కూడా హద్దుమీర కుండా డీసెంట్ గా ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది. బాటమ్‌లో పసుపు రంగు లాంగ్ ఫ్రాక్ ధరించిన ప్రియాంక దానికి కాంబినేషన్ గా మెడలో బంగారు ఆభరణాన్ని ఎంపిక చేసుకుంది. టాప్ లో కేవలం బ్లాక్ ఇన్నర్ ని ధరించి ఆపై బ్లాక్ కలర్ సూట్ ని ధరించి ఫోజులిచ్చింది. ప్రియాంక స్టైలింగ్, ఫ్యాషన్ ఎంపిక నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది వెరీ రేర్ కాంబినేషన్ అంటూ ఫ్యాషన్ ప్రియులు కితాబిచ్చేస్తున్నారు. ఈ ఫోటోషూట్ లో ప్రత్యేకించి ప్రియాంక స్ట్రైకింగ్ ఎక్స్ ప్రెషన్స్ హృదయాలను గెలుచుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ప్రియాంక 2025లో మూడు సినిమాల్లో నటించింది. `నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం` చిత్రంలో `గోల్డెన్ స్పారో` పాటలో కనిపించింది. పవన్ కల్యాణ్ `ఓజీ`లో కన్మణి పాత్రలో నటించింది. కవిన్ #9 అనే చిత్రంలోను ఈ బ్యూటీ నటిస్తోంది. కెన్ రాయ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ రొమాంటిక్ కామెడీ ఇది. కవిన్ - ప్రియాంక మోహన్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. థింక్ స్టూడియోస్ బ్యానర్‌పై స్వరూప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా `కవిన్ 09` అనే టైటిల్ పెట్టారు. షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమైంది.