సమంత వల్లే ఇండస్ట్రీలో అవకాశం.. 11 ఏళ్ల తర్వాత గుర్తు పట్టలేనంతగా!
ఆమె ఎవరో కాదు ఒకప్పుడు తన అందంతో మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాధ చిన్న కూతురే ఈ ముద్దుగుమ్మ. ఆమె తులసి నాయర్.;
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువ. కొంతమందికి అవకాశాలు వరుసగా వస్తే.. మరికొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అయితే అందులో కొంతమంది మళ్లీ ఎప్పుడైనా కనిపించినా అంతే అందంగా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే మరికొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారిలో కడలి హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు నాజూగ్గా తన అందంతో అందరి హృదయాలను దోచుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ల తర్వాత దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈమెను చూసిన ప్రతి ఒక్కరూ ఈమె ఆమేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఈమె ఎక్కడుంది? అసలు ఈమె ఎవరు? ఎందుకిలా బరువు పెరిగిపోయింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు ఒకప్పుడు తన అందంతో మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాధ చిన్న కూతురే ఈ ముద్దుగుమ్మ. ఆమె తులసి నాయర్. తన 14 యేటనే మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్న ఈమె.. ఈ పాత్రకు ప్రముఖ నటి సుహాసిని సిఫార్సు మేరకే మణిరత్నం తులసిని ఎంచుకున్నారు. నిజానికి ఈ పాత్రకు ఈమె చిన్నది అవుతుందనే కారణంతో మొదట మణిరత్నం తిరస్కరించినా.. ఈ సినిమా నుంచి సమంత తప్పుకోవడం తోనే సుహాసిని సలహా మేరకు తులసీని మళ్లీ తిరిగి తీసుకున్నారు మణిరత్నం. అలా సమంత తప్పుకోవడంతో తన మొదటి అరంగేట్రం జరిగిపోయింది.
అలా కడలి సినిమాతో తన అందంతో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2014లో యాన్ అనే చిత్రంలో నటించింది. రవి కె చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జీవా సరసన హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాల తర్వాత మరో చిత్రంలో నటించలేదు తులసీ నాయర్. ఇప్పటినుంచి ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇప్పుడు సడన్ గా 11 ఏళ్ల తర్వాత అత్యంత బరువు పెరిగిపోయి కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే ఇన్నాళ్లు మీడియాకి దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు సడన్గా మీడియా కంట పడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. ప్రముఖ హీరోయిన్ రాధా తల్లి తులసి నాయర్ అమ్మమ్మ నవంబర్ 27న కాలం చేశారు. ఈమె అంత్యక్రియలకు తులసి నాయర్ హాజరు కావడంతో ఈమె ఫోటోలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భారీగా బరువు పెరిగిపోయి వైట్ చుడీదార్ లో అత్యంత విచారకరంగా కనిపించింది తులసి నాయర్..ఇక ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తులసి నాయర్ ఇలా ఉన్నట్టుండి బరువు పెరగడంతో అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అభిమానులు ఆరా తీస్తున్నారు.