• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంత 'అమృతం'గా ఉండేనా?

అంత 'అమృతం'గా ఉండేనా?

By - Tupaki Desk
Update: 2020-01-09 04:34 GMT
30 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న ప్రేక్షకులు చాలా మంది బుల్లి తెరపై అమృతం సీరియల్‌ చూసే ఉంటారు. అప్పట్లో అమృతం ఒక సంచలనం. కామెడీ సీరియల్‌ గా ప్రారంభం అయిన అమృతం ఏ స్థాయిలో దూసుకు పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడెప్పుడు అమృతం కొత్త ఎపిసోడ్‌ వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఎదురు చూసేవారు. ఏ ఎపిసోడ్‌ కు ఆ ఎపిసోడ్‌ విభిన్నమైన కథలతో కాన్సెప్ట్‌ లతో అప్పట్లో అమృతంను తెరకెక్కించిన విషయం తెల్సిందే.

గుణ్ణం గంగరాజు మెదడు నుండి వచ్చిన అమృతం ఇప్పటికి కూడా ఏదో ఒక ప్లాట్‌ ఫార్మ్‌ ద్వారా ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉంది. అప్పట్లో వచ్చిన అమృతంను ఆ మద్య ఈటీవీ ప్లస్‌ లో ప్రసారం చేశారు. ఆ తర్వాత యూట్యూబ్‌ లో ఉంచారు. ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్‌ పై ఉంచారు. అమృతంకు వస్తున్న ఆధరణ చూసి జీ తెలుగు వారు అమృతం వెబ్‌ సిరీస్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సక్సెస్‌ అయితే దాన్నే ఛానెల్‌ లో కూడా ప్రసారం చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

అమృతం క్రియేటర్‌ అయిన గుణ్ణం గంగరాజును ఈ వెబ్‌ సిరీస్‌ కోసం రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో మాదిరిగానే అమృతం... ఆంజనేయులు.. అప్పాజీ.. సర్వం ఈ నాలుగు పాత్రలను బేస్‌ చేసుకుని విభిన్నమైన కాన్సెప్ట్‌ లతో అమృతంను కొనసాగించాలని భావిస్తున్నారు. కాని అప్పట్లో ఈ నాలుగు పాత్రలకు మంచి నటీనటులు దొరికారు.

అప్పటి కామెడీని ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. కాని ఇప్పుడు ప్రత్యేకంగా మళ్లీ వెబ్‌ సిరీస్‌ అంటూ తీస్తే ఆధరిస్తారా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే ఎంత సేమ్‌ టీం అయినా అమృతంను గతంలో చేసిన విధంగా ఆ ఫీల్‌ తో చేయడం అంటే ఎవరికైనా అసాధ్యం.

ఇప్పుడు వచ్చిన ప్రేక్షకుల అభిరుచి అనే ఉద్దేశ్యంతో ఏదో ఒక మార్పు చేయాల్సి ఉంటుది. దాంతో మొత్తం కాన్సెప్ట్‌ దెబ్బ తిని ఎపిసోడ్‌ చెడిపోయే అవకాశం ఉంది. అందుకే మళ్లీ అమృతం తీస్తే గతంలో మాదిరిగా అంత అమృతంగా ఉండక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    
  • Amrutham 
  • Web Series 
  • OTT 

Similar News

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS