• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీనాక్షిని ప‌రిచయం చేసిన...

మీనాక్షిని ప‌రిచయం చేసిన మ‌క్క‌ల్ సెల్వ‌న్‌

By - Tupaki Desk
Update: 2021-12-13 08:53 GMT
యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ఫాంట‌సీ వ‌ర‌ల్డ్ `హ‌ను మాన్‌`. తేజ్ స‌జ్జ హీరోగా న‌టిస్తున్నాడు. అంచ‌నాద్రి వ‌ర‌ల్డ్ నేప‌థ్యంలో స‌రికొత్త అనుభూతిని క‌లిగించే క‌థా, క‌థ‌నాల‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇందులోని చిత్ర విచిత్ర‌మైన పాత్ర‌ల ప‌రిచ‌య కార్య‌క్ర‌మాన్ని ఇటీవ‌లే ప్రారంభించారు. ఇందులో హీరోయిన్ గా అమృత అయ్య‌ర్ న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో న‌టిస్తున్న హీరోయిన్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఫ‌స్ట్ లుక్ వీడియోని విడుద‌ల చేశారు.

ఈ వీడియోని ల‌మిళ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి సోమ‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేశారు. సినిమాలో ఆమె పాత్ర పేరు మీనాక్షి అంటూ ప‌రిచ‌యం చేశారు. 40 సెక‌న్ల పాటు సాగిన ఈ వీడియోలోని విజువ‌ల్స్ అద్భుతంగా వున్నాయి.

స‌ముద్రంలో క‌ల‌ర్ క‌ల‌ర్ చేప‌లు పైకి లేస్తూ ఆట‌లాడుతుండ‌గా.. ఓ ప‌డ‌వ‌లో మీనాక్షి పాత్రధారి అమృత అయ్య‌ర్ చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

హ‌నుమంతుగా సూప‌ర హీరో పాత్ర‌లో తేజ స‌జ్జ‌ని ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు హీరోయిన్‌ని ఓ దేవ‌క‌న్య‌లా ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. వీడియోలో క‌నిపించిన విజువ‌ల్స్ కూడా ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాతో ఓ కొత్త అనుభూతిని క‌లిగించే ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ చేస్తున్న‌ట్టుగా స్ప‌ష్టం చేస్తున్నాయి.

తెలుగులోనే మ‌రీ ప్ర‌ధానంగా చెప్పాలంటే భార‌తీయ తెర‌పై మునుపెన్న‌డూ ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని సూప‌ర్ హీరో క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ చెబుతున్నారు.

అందుకు త‌గ్గ‌ట్టే సినిమా వుంటుంద‌నే భావ‌న‌ని విజువ‌ల్స్ క‌లిగిస్తున్నాయి. తెలుగు తెర‌పై తెర‌కెక్కుతున్న తొలి సూప‌ర్ హీరో క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ , హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేయబోతున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌రణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. లార్జ‌ర్‌దెన్ లైఫ్ మూవీగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

బిగ్ స్టార్స్ ... టాప్ గ్రేడ్ టెక్నిషియ‌న్స ఈ మూవీకి వ‌ర్క్ చేస్తున్నారు. కె. నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దాశ‌ర‌ది శివేంద్ర ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. అనుదీప్ దేవ్‌, హ‌రి గౌర‌, జ‌య‌కృష్ణ‌, కృష్ణ సౌర‌భ్ సంగీతం అందిస్తున్నారు. స‌రికొత్త కాన్సెప్ట్ ల‌తో సినిమాల్ని అందిస్తున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాతో ఎలాంటి సంచ‌న‌ల‌నాల‌కు తెర‌లేప‌నున్నారో తెలియాలంటే ఈ మూవీ విడుద‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.
Full View
Tags:    
  • Amritha 
  • Hanu Man 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS