• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ఇద్దరూ స్టార్...

ఆ ఇద్దరూ స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారా..?

By - Tupaki Desk
Update: 2020-04-05 02:30 GMT
సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. వాళ్లలో కొందరు అందం - అభినయంతో గుర్తింపు తెచ్చుకోగా - మరికొందరు ఆ ఒక్క సినిమాతోనే సరిపెడుతుంటారు. వాళ్లలో స్టార్ హీరోయిన్ హోదా పొందిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇంక మన టాలీవుడ్ విషయానికొస్తే ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు.

హీరోయిన్ అనే పదానికి ఒకప్పుడు సినిమాల్లో చాలా ప్రాధాన్యత - ప్రాముఖ్యత ఉండేది. కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. కేవలం గ్లామర్ షో చేస్తేనే ఇండస్ట్రీలో నిలబడతారు అనేది కూడా నిజం కాదు. తమ అభినయంతో నెట్టుకొచ్చిన హీరోయిన్లు కూడా ఉన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత - అనుష్క - నయనతార - కీర్తి సురేష్ - సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు.

అయితే ఇప్పుడు తాజాగా పరిచయమవబోతున్న ఇద్దరు హీరోయిన్లకు స్టార్ హీరోయిన్ గా ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. వాళ్లలో ఒకరు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న కృతి శెట్టి కాగా - మరొకరు యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమకథ' హీరోయిన్ అమృత అయ్యర్. ఇంకా సినిమాలు విడుదల కానప్పటికీ ఇప్పటికే రిలీజైన పాటలు - ప్రచార చిత్రాల ద్వారా మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు. టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా రిలీజ్ అవకముందే వీరికి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ డస్కీ బ్యూటీస్ ఇద్దరూ వచ్చిన ఛాన్సెస్ సరిగ్గా యూజ్ చేసుకుంటే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గతంలో కూడా స్టార్ హీరోయిన్ లక్షణాలు ఉన్న హీరోయిన్స్ చాలా మందే టాలీవుడ్ కి పరిచయమయ్యారు. వాళ్లలో పాయల్ రాజపుత్ - నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. డబ్బుల కోసం ఆశ పడి ఏ సినిమా అంటే ఆ సినిమా ఒప్పుకొని - ఏ పాత్ర అంటే ఆ పాత్ర చేసుకుంటూ పోతూ ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మంచి క్రేజ్ లో ఉన్న కృతి శెట్టి - అమృత అయ్యర్ వచ్చిన ఛాన్సెస్ జాగ్రత్తగా యూజ్ చేసుకొని స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారో, నభా - పాయల్ లా రెమ్యూనరేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫేడ్ ఔట్ అవుతారో రాబోయే రోజుల్లో చూడాలి.

 
Tags:    
  • Amritha Aiyer 
  • Krithi Shetty 
  • Telugu Film Industry 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS