షాకింగ్ గా స‌మ్మోహ‌నం న‌టుడి మ‌ర‌ణం

Update: 2019-07-11 07:32 GMT
అమిత్ పురి అంటే ఎవ‌రంటాం. కానీ.. ఆ మ‌ధ్య‌న విడుద‌లైన స్వీట్ మూవీ స‌మ్మోహ‌నంలో ఆదితి రావ్ హైద‌రీ ప్రియుడిగా న‌టించినోడు గుర్తున్నారా? అంటే చ‌ప్పున గుర్తు తెచ్చుకుంటాం. స‌మ్మోహ‌నం సినిమాలో ఆదితి బాయ్ ఫ్రెండ్ గా న‌టించిన న‌టుడిపేరు అమిత్ పురోహిత్. విల‌నిజాన్ని పండించ‌టంలో మంచి మార్కులు కొట్టేసిన ఇత‌గాడు అక‌స్మికంగా మ‌ర‌ణించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఇత‌డికి మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అలాంటిది అత‌డి మృతి ఇప్పుడు షాకింగ్ గా మారింది. అమిత్ మ‌ర‌ణంపై స‌మ్మోహ‌నం టీం తీవ్ర దిగ్భ్రాంతిని.. షాక్ ను తెలియ‌జేసింది.

బుధ‌వారం సాయంత్రం అమిత్ మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అత‌గాడి మృతికి కార‌ణం మాత్రం ఎవ‌రూ చెప్పక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఒక మంచి న‌టుడ్ని కోల్పోయిన‌ట్లుగా హీరో సుధీర్ బాబు.. హీరోయిన్ ఆదితి రావ్ హైద‌రీ.. ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ‌లు త‌మ సంతాపాన్ని తెలియ‌జేశారు. అమిత్ మ‌ర‌ణం గురించి సుధీర్ తొలుత ట్వీట్ చేయ‌టంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. హిందీలో రెండు..మూడు సినిమాల్లో అమిత్ న‌టించారు.


    

Tags:    

Similar News