రంగంలోకి దిగమంటున్న అమల

Update: 2017-02-20 05:54 GMT
తాజాగా మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. 25 కిలోమీటర్ల పాటు రన్నింగ్ కార్ లో వేధించారు దుండగులు(ఆమె కారు మాజీ డ్రైవర్లు). ఈ ఘటనపై పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది భావన. సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న హీరోయిన్లు.. ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం చాలాచాలా అరుదు.

భావన చూపిన ధైర్యంపై ఇప్పుడు మరో హీరోయిన్ అమలాపాల్ స్పందించింది. భావనను ఓ ధీరవనితగా అభివర్ణిస్తూ ఆమె ఫోటో షేర్ చేసిన అమలాపాల్.. 'మహిళల పవిత్రతను తమకు గిఫ్ట్ గా కొందరు భావించడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందన్న నా భయం.. నా తోటి నటి విషయంలో నిజమైంది. హ్యాట్సాఫ్ టు ఐరన్ లేడీ భావన. మా యాక్ట్రెస్ లలో తనే నిజమైన హీరో. ఈ మొత్తం ఘటన గురించి ఏ మాత్రం ఆలోచించకుండా పోలీసులకు ఫిర్యాదు చేశావ్' అని ప్రశంసించింది.

'నేను నీకు తోడుగా నిలుస్తాను భావనా. నువ్వ మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తావ్. ఇప్పుడు మీడియా కొంత బాధ్యతను చూపించాల్సిన సమయం అసన్నమైంది. చట్టం వ్యాపింపచేయలేకపోతున్న ఓ సందేశాన్ని.. మీడియా బాధ్యతగా తీసుకోవాలి. యాక్టర్ల వ్యక్తిగత జీవితాలపై చూపేలాంటి ఇంట్రెస్ట్ నే.. ఈ అంశంపై కూడా చూపించాలి. ఇలాంటి పనులు చేసే వాళ్లను.. వాళ్ల కుటుంబాలను వెలుగులోకి తీసుకొచ్చి.. మరోసారి ఎవరూ చేయకుండా బుద్ధి చెప్పాలి' అనింది అమలా పాల్.

'ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేస్తే సరిపోదు. దీన్ని ఒక ఉద్యమంలా భావించి నడిపించాలని కేరళ యువతను నేను కోరుతున్నా. నా మద్దతు.. ధైర్యం చూపించేందుకు నేను రెడీగా ఉన్నా. రంగంలోకి దిగాల్సిన సమయం ఇది' అంటూ ఆవేశంగా అయినా తన ఉద్దేశ్యాలను సుదీర్ఘంగా వివరించింది అమలాపాల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News