మొగుడి డైరెక్షన్ లో చేస్తుందిట.. కానీ..
మిసెస్ అమలాపాల్ రోజుకో షాకింగ్ న్యూస్ చెబుతోంది. డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ని పెళ్లాడాక ఈ అమ్మడిలో బోలెడంత పరిణతి వచ్చేసింది. అందుకే నిత్యం డెవలప్‌మెంట్‌కి సంబంధించిన బోలెడన్ని విషయాల్ని అందరితో చర్చిస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి నిర్మాతగా మారిపోయింది. థింక్ బిగ్ స్టూడియోస్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ పెట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేనా తన భర్త సినిమాలకు ఫ్యాషనిస్టుగా పనిచేస్తోంది. ఈ సంగతులన్నీ వివరిస్తూ అమలాపాల్ ఇలా చెప్పింది..
విజయ్ తో పెళ్లి తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉంది. బోలెడంత మెచ్యూరిటీ సంపాదించాను. అలాగే ఎగ్జిస్టెన్సీ కోసం ప్రస్తుతానికి ఫ్యాషన్, ఎండోర్స్‌మెంట్స్ పైనే దృష్టి సారించాను. అలాగే నిర్మాతగా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నా. ఇంటర్నేషనల్ పిలింఫెస్టివల్స్ లక్ష్యంగా సినిమాల్ని నిర్మిస్తాం. అలాగే నటిగా ఓ సినిమా అవకాశాన్ని వదులుకోలేకపోయా.
మలయాళంలో మహిళా ప్రధాన చిత్రం 'హైకూ'లో నటిస్తున్నా. ఇది పిల్లల పట్ల తల్లి దండ్రులు ఎలాంటి శ్రద్ధ చూపించాలి. పెంపకం ఎలా సాగాలి? అని చెప్పే సినిమా. ఇందులో మమ్మీగా నటించా.. అని గలగలా ముచ్చటించింది. అంతేకాదండోయ్ మా ఆయన దర్శకత్వంలో నటిస్తా. కానీ వేరే దర్శకులు చెప్పిన స్క్రిప్టులు నచ్చనప్పుడు మాత్రమేనంటూ ట్విస్టిచ్చింది చివరిలో.