• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు హీరో నెక్స్ట్...

అల్లు హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

By - Tupaki Desk
Update: 2019-07-06 04:25 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా పరిచయమైన అల్లు శిరీష్ పరిశ్రమకు వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కెరీర్ సక్సెస్ ట్రాక్ లో పడటం లేదు. ఎంత ఆచి తూచి కథలను దర్శకులను ఎంచుకున్నా ఫలితాలు మాత్రం ప్రతికూలంగానే వస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అనిపించుకున్న ఎబిసిడిని ఏరికోరి రీమేక్ చేసుకుంటే ఇదీ తేడా కొట్టేసింది. దీని వల్ల తాను పాఠాలు నేర్చుకున్నానని సోషల్ మీడియాలో పబ్లిక్ గా ఒప్పేసుకున్న శిరీష్ ఇకపై ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి శిరీష్ తన సినిమాల నిర్మాణంలో దర్శకత్వ వ్యవహారాల్లో తల దూరుస్తాడని అందువల్లే ఫైనల్ అవుట్ పుట్ ఆశించిన విధంగా రావడం లేదని తనతో వర్క్ చేసిన డైరెక్టర్లు కామెంట్ చేసినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అవి వాస్తవమో కాదో తెలియదు కాని రిజల్ట్స్ విషయంలో శిరీష్ బాద్యతను విస్మరించలేం.మరో ట్విస్ట్ ఏంటంటే నిర్మాతలు శిరీష్ తో సినిమా అంటే అంత సాహసం చేయలేకపోతున్నారట.

ఎవరైనా దర్శకుడు ప్రొడ్యూసర్ దగ్గర ప్రతిపాదన తీసుకెళ్ళినా వర్క్ అవుట్ కాదని చెప్పి పంపించేస్తున్నారట. దీనికి కారణం చాలా వీక్ అయిపోయిన శిరీష్ మార్కెటే. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ సినిమా శ్రీరస్తు శుభమస్తు ఒక్కటే. దానికన్నా ముందువి తర్వాత వచ్చినవి ఏవీ పేర్లు కూడా గుర్తులేనంత ఈజీగా ధియేటర్ల నుంచి మాయమయ్యాయి. పోనీ స్వంత బ్యానర్ గీతా ఏమైనా శిరీష్ తో వరసగా సినిమాలు ప్లాన్ చేస్తోందా అంటే అలాంటి ఊసే లేదు. ఈ నేపధ్యంలో శిరీష్ నెక్స్ట్ స్టెప్ వేయడం గురించి ఇంకొంత టైం తీసుకోక తప్పేలా లేదు.

    

Tags:    
  • Allu Sirish 
  • Movie News 
  • Latest updates 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS