ప్రోవోక్ చేస్తున్న అల్లువారి అబ్బాయి!

Update: 2019-01-31 13:06 GMT
ప్రోవోక్ చేస్తున్న అల్లువారి అబ్బాయి!
అల్లు అర్జున్ తమ్ముడిగా.. అల్లు అరవింద్ తనయుడిగా.. మెగా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇప్పటివరకూ ఐదు సినిమాలు చేసిన శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో ఓక మోస్తరు విజయం సాధించాడుగానీ ఇంకా సాలిడ్ హిట్ అయితే రాలేదు.  ప్రస్తుతానికి అదే ప్రయత్నాలలో ఉన్నాడు ఈ అల్లువారి అబ్బాయి.

తాజాగా శిరీష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు "ప్రోవోక్ మ్యాగజైన్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది.  ఫోటో షూట్ & ఇంటర్వ్యూ ఫన్ గా ఉంది.  ప్రోవోక్ కాపీస్ కొనుగోలు చేయండి!" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  ఇక శిరీష్ పోజు మాత్రం అదిరిపోయిందంతే.  పులి చారల లాంటి డిజైన్ ఉన్న హాఫ్ షర్ట్.. ఎలిఫెంట్ బ్లాక్ కలర్ టోర్న్ జీన్స్.. వైట్ కలర్ స్పోర్ట్ షూస్ తో స్టైల్ గా కూర్చున్నాడు.  కరెక్ట్ గా చెప్తే స్టైలిష్ స్టార్ కు సరైన తమ్ముడనిపించాడు. అంత స్టైలిష్ గా ఉన్నాడు.

సినిమాల విషయానికి వస్తే అల్లు శిరీష్ ప్రస్తుతం 'ఎబీసీడీ- అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్ద్ దేశి' అనే సినిమాలో నటిస్తున్నాడు.  మలయాళం సూపర్ హిట్ అయిన 'ఏబీసిడీ' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Tags:    

Similar News