పాక్ ట్యాంకర్లు.. అల్లు హీరో కామెంట్స్
అల్లు శిరీష్ ఇప్పుడు మలయాళ చిత్రం 1971 బెయాండ్ బోర్డర్స్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మూవీ తెలుగులో 1971 భారత సరిహద్దు అనే పేరుతో విడుదల కానుండగా.. ఈ చిత్రంలో అల్లు హీరో ఓ వార్ ట్యాంకర్ ఆపరేటర్ గా నటించాడు. మేజర్ రవి డైరెక్షన్ లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందింది.
వార్ ట్యాంకర్ గా నటించిన అనుభవం.. మేజర్ రవి డైరెక్షన్ లో పెంచుకున్న జ్ఞానం.. సహజంగానే కొత్త విషయాలపై ఉన్న ఆసక్తి వంటి కారణాలతో.. ఆ నాటి యుద్ధంలో భారత్ పై చేయి సాధించడానికి కారణం ఏంటో తెలుసుకున్న అల్లు శిరీష్.. యుద్ధ ట్యాంకర్ల గురించి కొత్త విషయాలు చెప్పాడు. షూటింగ్ లో తాను ఈ విషయాలు తీసుకున్నానంటూ వివరించాడు అల్లు వారబ్బాయి.
"భారత సైన్యం దగ్గర రష్యా తయారు చేసిన టీ-72.. టీ-90 యుద్ధ ట్యాంకులు ఉండేవి. పాకిస్తాన్ ఆర్మీ దగ్గర యూఎస్ తయారు చేసిన పాటన్స్ ఉండగా.. అవి ఆధునికమైనవి కూడా. కానీ మన సైన్యం దగ్గర ఆ ట్యాంకర్లను ఉపయోగించడమే కాకుండా.. మరమ్మత్తు చేయగల నైపుణ్యం కూడా ఉండేది. కానీ పాక్ ఆర్మీకి వాటిని ఉపయోగించమడే తెలుసు. అందుకే వారి ట్యాంకర్ కి ఏదైనా జరిగితే వదిలేసి వెళ్లిపోయేవారు. కానీ మన సైన్యం మాత్రం మళ్లీ రిపేర్ చేసేసుకునేవారు. అందుకే మన సైన్యం పై చేయి సాధించింది. టీ-90 ట్యాంకర్లను స్వయంగా తయారు చేయగలిగే టెక్నాలజీ మనకు అబ్బింది. టెక్నాలజీని పూర్తిగా నేర్చుకోవడం ముఖ్యం" అంటున్నాడు అల్లు శిరీష్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/