వీడియో: అల్లు వారి కోడలు ఫన్ ఛాలెంజ్
అల్లు వారి కోడలు ఫన్ ఛాలెంజ్ ప్రస్తుతం నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ బన్ని వైఫ్ స్నేహా విసిరిన ఛాలెంజ్ యేనా ఇది? అంటే కానే కాదు. అల్లు అరవింద్ పెద్ద కోడలు నీలూ షా విసిరిన ఛాలెంజ్ ఇది. వీక్షించేందుకు ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నా.. చాలా కష్టమైనదేనని అంటున్నారు నెటిజనం.
ఇంతకీ ఏమిటా ఛాలెంజ్? అంటే.. నీలూ షా ఎలాంటి వాల్ ఆధారం అవసరం లేకుండానే నేలపై చాలా సింపుల్ గా శీర్షాషనం వేశారు. ఈ అసనంలో నేలపై తలను ఆన్చి నెమ్మదిగా రెండు కాళ్లను పైకి లేపారు. క్లిష్టమైనదే అయినా ఎంతో బ్యాలెన్స్ డ్ గా అసనం వేసి చూపించారు. అంతేకాదు.. కాళ్లకు తొడుక్కున్న సాక్సుల్ని ఒకటొకటిగా తొలగించి భళా అనిపించారు. అవసరం మేర కాలి సాయంతోనే ఇలా సాక్సుల్ని తొలగించడం ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశారు.
బన్ని సోదరుడు అల్లు బాబీ (వెంకటేష్) భార్యామణి నీలూ షా. తను డ్యాన్స్& యోగా స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. అందుకే అంత అలవోకగా శీర్షాషనం వేసి చూపించారు. ఇలాంటివి కొత్త వాళ్లు ప్రాక్టీస్ చేయాలంటే ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు ఇలా ఎన్నో ఆసక్తికర ఫీట్లతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు బాబీ నిర్మాతగా సినిమాలు తీస్తూనే నటనలోనూ ప్రవేశిస్తున్నాన్న సమాచారం ఉంది.