షోలే తర్వాత అంతటి పరిపూర్ణమైన సినిమా!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు -మధురమైన అనుభూతులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దిగ్గజ దర్శకుడు సూరజ్ బర్జాత్యా.;

Update: 2026-04-15 10:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు -మధురమైన అనుభూతులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దిగ్గజ దర్శకుడు సూరజ్ బర్జాత్యా. తాజాగా ఆయ‌న ధురంధర్ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలా రికార్డులు న‌మోదు చేసిందో తెలిసిందే. బాలీవుడ్ లో కొంద‌రు త‌ప్ప దేశ‌మంతా ఈ సినిమా గురించి ఎంతో గొప్ప స్పందించింది. ప్ర‌త్య‌ర్ధుల్ని భార‌త్ టార్గెట్ చేసిందంటే శ‌త్రు దేశంపై ఎలా విరుచుకుప‌డుతుందో చెప్ప‌క‌నే చెప్పారు.

అయితే ఈ చిత్రాన్ని సూర‌జ్ 1975 నాటి క్లాసిక్ షోలే`తో పోల్చ‌డం విశేషం. ఓ క్లాసిక్ డైరెక్ట‌ర్ రా అండ్ ర‌స్టిక్ చిత్రాన్ని మ‌రో క్లాసిక్ తో పోల్చ‌డం విశేషం. దర్శకుడు ఆదిత్య ధర్ పని తీరును ప్ర‌శంశిస్తూ `ధురంధర్ ఒక సూపర్బ్ బ్లాక్ బస్టర్ బర్జాత్యా కొనియాడారు. సాధారణంగా తాను ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అయితే ఒక దర్శకుడిగా ఏది మంచిదో దాన్ని తప్పకుండా మెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రను ఆదిత్య ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. అందుకే ఇది షోలే తర్వాత వచ్చిన ఒక పరిపూర్ణమైన చిత్రంగా తనకు అనిపించిందన్నారు.

కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే కాకుండా ఈ తరహా సినిమాలు యువ తరంలో ఒకరిపై ఒకరికి నమ్మకం , తోడ్పాటును అందించేలా ఉంద‌ని బర్జాత్యా అభిప్రాయపడ్డారు. సమాజంలో పెరుగుతోన్న ఒంటరితనాన్ని, విభజనను తగ్గించేలా బలమైన కథాంశాలతో భ‌విష్య‌త్ సినిమాలు రావాలని ఆకాంక్షించారు. సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన సూరజ్ బర్జాత్యా వంటి సీనియర్ దర్శకుడు ఒక యంగ్ డైరెక్టర్ చేసిన యాక్షన్ థ్రిల్లర్‌ను ఆకాశానికెత్తడం చిత్ర యూనిట్‌ పెద్ద గౌరవంగా భావిస్తుంది. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ విజన్ వెరసి ధురంధర్ ను గ్లోబల్ స్థాయిలో తిరుగులేని బ్రాండ్‌గా నిలబెట్టాయి.

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ధురంధర్ విమర్శకుల ప్రశంసలే కాకా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి భాగం హంజా అనే భారతీయ గూఢచారి కథతో 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మార్చి 19న విడుదలైన రెండో భాగం ధురంధర్: ది రివెంజ్ నాలుగు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లను రాబట్టింది. మొత్తంగా ఈ ఫ్రాంచైజీ 3000 కోట్ల మార్కును దాటి భారతీయ సినిమాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Tags:    

Similar News