అల్లు అర్జున్ తర్వాతే సూపర్ స్టార్, రౌడీ స్టార్
2020 సంవత్సరం ప్రారంభం అయ్యి నాలుగు నెలలు పూర్తి చేసుకుని అయిదవ నెల కూడా ప్రారంభం అయ్యింది. ఈ నాలుగు నెలల్లో రెండు నెలలు కరోనా కారణంగా సెలబ్రెటీలు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా నేపథ్యంలో నెట్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. ఇంటర్నెట్ లో ప్రముఖులను సెర్చ్ చేసిన వారి సంఖ్య భారీగా ఉంది. తాజాగా ఒక మీడియా సంస్థ 2020లోని మొదటి నాలుగు నెలల్లో అత్యధికంగా వెతకబడ్డ స్టార్స్ జాబితాను విడుదల చేయడం జరిగింది.
హీరోల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ గురించి అత్యధికంగా నెటిజన్స్ వెదికారు. 21 లక్షల సెర్చ్ లు సల్మాన్ పేరుతో నమోదు అయ్యాయి. ఆయన సినిమాలు ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు మరియు ఆయన పెళ్లి గురించి నెటిజన్స్ చాలా ఆసక్తిగా వెదికారు. ఆ తర్వాత స్థానంను విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలను నెటిజన్స్ నెట్టింట వెదికారు. టాప్ 10 లో మన తెలుగు హీరోలు కూడా స్థానం దక్కించుకున్నారు.
టాప్ 10 లో ఆశ్చర్యకరంగా అల్లు అర్జున్ 5వ స్థానంను దక్కించుకోగా విజయ్ దేవరకొండ 8వ స్థానంను మహేష్ బాబు 10వ స్థానంను దక్కించుకున్నాడు. అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాది ఆరంభంలో వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన కారణంగా అత్యధికంగా బన్నీ పేరుతో సెర్స్ నమోదు అయ్యి ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ మరియు మహేష్ బాబుల తదుపరి చిత్రాలు మరియు క్వారెంటైన్ టైం ను ఎలా గడుపుతున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్ సెర్చ్ కొట్టారు.
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే నెం.1 గా ప్రియాంక చోప్రా నిలిచింది. ఈమె పేరుతో 39 లక్షల సెర్చ్ లు నమోదు అయ్యాయి. సన్నీలియోన్ 31 లక్షల సెర్చ్ లతో రెండవ స్థానంలో నిలిచింది. కత్రీనా కైఫ్ 20 లక్షల సెర్చ్ లతో మూడవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో తెలుగు హీరోయిన్ రష్మిక మందన్నా 10వ స్థానంలో నిలిచింది. సౌత్ నుండి టాప్ టెన్ లో రష్మిక మందన్నా కు మాత్రమే ఛాన్స్ దక్కింది.