పవన్ లోని ఆ పిచ్చిని గమనించిన బన్నీ

Update: 2018-06-06 11:02 GMT
పవన్ లోని ఆ పిచ్చిని గమనించిన బన్నీ

కొద్దిరోజుల క్రితం వరకూ పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ మధ్య సఖ్యత లేదు.. ఓ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ కామెంట్ చేసి బన్నీ సంచలనం రేపాడు. దీంతో సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేసి పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ఆ తర్వాత మొన్నటి శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ కు సపోర్టుగా నిలిచి పవన్ వెంట నడిచాడు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా స్పందిస్తున్న బన్నీ తాజాగా ట్విట్టర్ అకౌంట్లో పవన్ రాజకీయ ప్రస్థానం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పవన్ పై విమర్శల వాన రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ వైపు టీడీపీ, మరో వైపు వైసీపీ నాయకులు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ ఒంటరిగా పోరాడుతుండడం చూసి మెగా ఫ్యామిలీ కూడా బాధపడుతోంది. ఇలాంటి వాటి విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యే అల్లు అర్జున్ తాజాగా ఫేస్ బుక్ ద్వారా మామకు మద్దతు పలికారు. అంతేకాదు భరోసానిచ్చేలా పోస్టు పెట్టి  అండగా నిలబడ్డాడు.

అల్లు అర్జున్ ఈరోజు ఫేస్ బుక్ లో చేసిన పోస్టు వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న ఓ చక్కటి ఫొటోను షేర్ చేసి దానిమీద ఇలా రాసుకొచ్చాడు.. ‘సిద్ధాంతాల కోసం పిచ్చిగా జీవించాలి. అప్పుడు ప్రపంచం కూడా నీతోపాటు సర్దుకుపోతుంది’ అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశాడు. ఇలా రాజకీయాల్లో పవన్ పై జరుగుతున్న దాడిని ఒక్క మాటతో అందరికీ అర్థమయ్యేలా చెప్పి బన్నీ అందరి మనసులను చూరగొన్నాడు.
Tags:    

Similar News