డీజే లుక్ ఇదా? ఇలా ఉంటాడా?

Update: 2017-01-20 12:28 GMT
అల్లు అర్జున్ ప్రస్తుతం డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే చాలా రూమర్స్.. గాసిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా బన్నీ చేయబోతున్న రోల్ పై లెక్కలేనన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తాజాగా డీజే వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి. వీటిలో బన్నీ చాలా నార్మల్ గా కనిపిస్తున్నాడు. కొంచెం హెయిర్ స్టైల్ మార్చడం.. గెడ్డం లుక్ తో కనిపించడం మినహాయిస్తే.. భారీగా మార్పులేమీ లేవు. ఇప్పటివరకూ వచ్చిన వార్తలన్నిటికీ విరుద్ధంగా ఉంది బన్నీ గెటప్. డీజే చిత్రంలో బన్నీ ఓ బ్రాహ్మిన్ పాత్ర పోషిస్తున్నాడనే టాక్ ముందు నుంచి ఉంది. ఇంకా చెప్పాలంటే.. అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ పోషించిన చారి పాత్రనే లీడ్ రోల్ గా చేసి.. డీజే ను తెరకెక్కిస్తున్నాడనే అంతా అనుకుంటున్నారు. అదుర్స్2 ని బన్నీ చేసేస్తున్నాడనే గాసిప్ కూడా వినిపించింది.

కానీ ఈ ఫోటోలు చూస్తుంటే.. బన్నీ లుక్ చాలా సింపుల్ గా నార్మల్ గా కనిపిస్తున్నాడు. ఎక్కడా పక్కా బ్రాహ్మిన్ లుక్ అయితే మాత్రం లేదు. ఈ లెక్కన ఇన్నాళ్లూ వచ్చినవన్నీ రూమర్సేనా అనిపించడం సహజం. ఇంతకీ అసలు డీజేలో బన్నీ చేస్తున్న రోల్ ఏంటబ్బా అంటే మాత్రం.. ఇప్పటికిప్పుడు ఆన్సర్ చేయడం కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News