ఇమేజ్ మేకోవర్ కు బన్నీ సిద్ధం!

Update: 2018-08-18 11:10 GMT
ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఎన్నడూ లేనంత సఖ్యత కనిపిస్తోంది.  ఒకరి సినిమాను మరొకరు అభినందించడం - ఇద్దరు హీరోలు కలిసి ఒకే వేదిక పంచుకోవడం - కలిసి పార్టీలు చేసుకోవడం కామన్ అయిపోయాయి.  ముఖ్యంగా ఇలా కలివిడిగా ఉండేవాళ్ళలో రామ్ చరణ్- ఎన్టీఆర్ - మహేష్ బాబు ల పేర్లు చెప్పుకోవాలి.   ఇప్పటికే చరణ్-ఎన్టీఆర్ - మహేష్ లు కలిసి ఎంజాయ్ చేసే ఫోటోలు మీడియాలో చాలానే బయటకు వచ్చాయి.

కానీ ఈ లిస్టు లో ఎప్పుడూ అల్లు అర్జున్ పేరు మాత్రం వినిపించదు.  దీంతో బన్నీ ఇతర హీరోలతో కలివిడిగా ఉండడనే టాక్ ఒకటి వినిపిస్తోంది. మరి ఆ ఇమేజ్ ను మార్చుకునేందుకు అల్లువారి హీరో సిద్దమయ్యాడట.  తాజా సమాచారం ప్రకారం బన్నీ 'గీత గోవిందం' సక్సెస్ అయిన సందర్భంగా ఒక  ఫిలిం యూనిట్ కి ఒక మంచి పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట.  ఈ సినిమా అల్లు అరవింద్ సెకండ్ బ్యానర్ GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన విషయం తెలిసిందే. దానికితోడు, నిర్మాత బన్నీ వాస్ తనకు చాలా క్లోజ్.  ఈ పార్టీకి మహేష్ బాబు ను  ఇన్ వైట్ చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ.

ఇక అంతా అనుకున్నట్టు జరిగితే స్టైలిష్ స్టార్ - సూపర్ స్టార్ - రౌడీ స్టార్ ను ఒక ఫ్రేమ్ లో చూడచ్చు. మరి బన్నీ ఇమేజ్ మేకోవర్ కు ఇదో మొదటి స్టెప్ కూడా అయ్యే అవకాశం ఉంది.  అందరితో కలిసి మెలిసి ఉండాలనే ఆలోచన మంచిదే కదా.
Tags:    

Similar News