• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కలర్ ఫోటో' టీమ్ కి బన్నీ...

'కలర్ ఫోటో' టీమ్ కి బన్నీ ప్రశంసలు..!

By - Tupaki Desk
Update: 2020-10-31 11:30 GMT
హాస్యనటుడు సుహాస్‌ హీరోగా పరిచయమైన సినిమా ''కలర్ ఫోటో''. సుహాస్‌ కు జోడిగా తెలుగుమ్మాయి చాందినీ చౌదరి నటించింది. సునీల్ నెగెటివ్ రోల్ లో కనిపించగా వైవా హర్ష కీలక పాత్రలో నటించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'హృదయ కాలేయం' సాయిరాజేష్ - లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బెన్నీ ముప్పనేని నిర్మించారు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించాడు. ఇటీవలే 'ఆహా' తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో ఈ సినిమా విడుదలైంది. స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ డే నుంచే 'కలర్ ఫోటో' ఓటీటీ ఆడియన్స్ మరియు విమర్శకులు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీలో విడుదలైన సినిమాలో బెస్ట్ సినిమా అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రానికి ఫిదా అయ్యాడు.

'కలర్ ఫోటో' చిత్రాన్ని చూసిన బన్నీ చిత్ర యూనిట్ ని పిలిపించుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. హీరో సుహాస్ - హీరోయిన్ చాందిని చౌదరి - దర్శకుడు సందీప్ రాజ్ - హర్ష - మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ - స్టోరీ అందించడంతో పాటు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సాయి రాజేష్ కు అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బన్నీ ట్వీట్ చేస్తూ ''కలర్ ఫోటో ఎంటైర్ టీమ్ కి నా అభినందనలు. చాలా మధురమైన ప్రేమకథ & అద్భుతమైన సంగీతం, భావోద్వేగాలు మరియు పర్ఫార్మన్స్ లతో వెంటాడే చిత్రం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నాడు. దీనికి చిత్ర బృందంతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. అల్లు అర్జున్ ఈ సినిమా చూసి అభినందించడంతో 'కలర్ ఫోటో' చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Allu Arjun 
  • Colour Photo 
  • Team Unit 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS