వావ్.. డీజే అరిపించాడుగా!!

Update: 2017-05-29 08:12 GMT
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే- దువ్వాడ జగన్నాధం రిలీజ్ కు డేట్ దగ్గర పడుతోంది. ఇంకా నాలుగు వారాల్లో అంటే.. జూన్ 23న దువ్వాడ జగన్నాధం థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఒక్కక్కటిగా పాటలు రిలీజ్ చేస్తూ సినిమాకు హైప్ పెంచే ప్లాన్ ను యూనిట్ ఇప్పటికే అమలు చేస్తోంది.

మొదట శరణం భజే భజే అంటూ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్న దువ్వాడ జగన్నాధం యూనిట్.. ఇప్పుడు 'గుడిలో బడిలో మడిలో' అంటూ సాగే పాటను రిలీజ్ చేయనుంది. ఈ లిరిక్ సంబంధించిన  పోస్టర్ ను విడుదల చేశారు. హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి బన్నీ ఓ సూపర్బ్ స్టెప్ వేస్తున్న పోజ్ ను పోస్టర్ గా వదిలారు. పూజా అందాలకు.. బన్నీ తిరిగుతున్న మెలికలు కలిపి.. పోస్టర్ కేకలు పెట్టించేలా ఉంది. హీరోయిన్ కూడా ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్ వేసిందనే విషయం అర్ధమవుతూనే ఉంది.

ఈ పాటను దుబాయ్ లోని పలు లొకేషన్స్ లో స్పెషల్ గా చిత్రీకరించారు. మూవీ హైలైట్స్ లో గుడిలో బడిలో సాంగ్ కూడా ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పాటకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News