'కియారా' కియారా ' అంటూ వెనక పడుతున్నారు!

బాలీవుడ్ సీనియర్ స్టార్స్ ని పక్కన పెట్టి ఒక రేంజ్ లో దూసుకుపోతున్న భామ కియరా అద్వాని.

Update: 2024-05-07 03:55 GMT

బాలీవుడ్ సీనియర్ స్టార్స్ ని పక్కన పెట్టి ఒక రేంజ్ లో దూసుకుపోతున్న భామ కియరా అద్వాని. కెరీర్ మొదట్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసి మెప్పించిన అమ్మడు తన టాలెంట్ తో మెప్పించి మెయిన్ హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. కియరా కెరీర్ అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ని డబుల్ చేసిన సీరీస్ లస్ట్ స్టోరీస్. ఆ సీరీస్ లో కియరా ఎక్స్ ప్రెషన్స్ ఆమెను ఆడియన్స్ కు మరింత దగ్గ్గరయ్యేలా చేసింది. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేసిన అమ్మడు ఆ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.

ప్రస్తుతం చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది కియరా అద్వాని. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాతో కియరా మరోసారి సౌత్ లో సూపర్ హిట్ అందుకుంటుందని అంటున్నారు. మరోపక్క బాలీవుడ్ లో వార్ 2, డాం 3 ఇలా వరుసగా క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది కియరా అద్వాని.

పెళ్లైన తర్వాత కూడా బాలీవుడ్ లో తన డామినేషన్ ని కొనసాగిస్తుంది అమ్మడు. గేం చేంజర్ సినిమా చేస్తున్న కియరా కు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటున్న కియరా తెలుగులో నటించాలని ఉన్నా కూడా డేట్స్ అడ్జెస్ట్ అవ్వక చేయడం కుదరట్లేదని తెలుస్తుంది. ప్రస్తుతం వార్ 2, డాన్ 3 సినిమాలకు తన డేట్స్ ఇచ్చిన కియరా ఆ రెండిటిలో ఏదైనా ఒకటి పూర్తైతే కానీ అమ్మడు ఫ్రీ అవ్వదని తెలుస్తుంది.

Read more!

ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ లో దూకుడు చూపిస్తున్న వారిలో కియరా అద్వాని ముందుంటుంది. కచ్చితంగా అమ్మడు రానున్న రోజుల్లో మరింత పాపులర్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ లో కియరా క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పాన్ ఇండియా సినిమాలకు అమ్మడిని తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. సో ఈ దూకుడు చూస్తుంటే కియరా కెరీర్ మరో దశాబ్దం పాటు ఇలాంటి ఫాం కొనసాగించేలా ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News