ఇంద్ర‌జ క‌న్న కూతురు అతిలోక సుంద‌రి

ఇటీవ‌లే బుచ్చిబాబుతో సినిమా లాంచ్ వేడుక‌లో యాధృచ్ఛికంగానే రామ్ చ‌ర‌ణ్ `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ గురించి ప్ర‌స్థావించారు.

Update: 2024-05-07 03:51 GMT

దేవ‌లోకంలో ఇంద్ర‌జ ఏం చేస్తూ ఉంటుందో? భూలోకంలో జ‌గ‌దేక వీరుడితో సీక్వెల్ గురించి ఆలోచిస్తోందో ఏమో కానీ, ఇదిగో ఇక్క‌డ త‌న‌ కుమార్తె అందుకు ప్రిప‌రేష‌న్ సాగిస్తోంద‌నే అర్థ‌మ‌వుతోంది. ఇంద్ర‌జ త‌న కుమార్తెను సీక్వెల్ కి సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌గ‌ధీరుడి స‌ర‌స‌న అతిలోక సుంద‌రి 2 రెడీ అవుతోంది.


తాజాగా జాన్వీ క‌పూర్ కొత్త లుక్ చూశాక అభిమానుల ఫీలింగ్స్ ఇవి. జాన్వీ క‌పూర్ స్పెష‌ల్ ఫోటోషూట్ లో దేవ‌క‌న్య‌లా ఉందంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రంలో శ్రీ‌దేవి ఎంత అందంగా క‌నిపించిందో జాన్వీ కూడా అంతే అందంగా క‌నిపిస్తోంద‌ని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. ఈ స్పెష‌ల్ డిజైన‌ర్ డ్రెస్ నిజంగా జాన్వీ అందాన్ని ప‌దింత‌లు పెంచింది. దేవ‌క‌న్య‌నే త‌ల‌పిస్తోంది. ఇంద్రుని కుమార్తె ఇంద్ర‌జ బ్లెస్సింగ్స్ అందుకుని జాన్వీ ఇప్పుడు సీక్వెల్ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేస్తుంద‌నే ఫ్యాన్స్ భావిస్తున్నారు.


ఇటీవ‌లే బుచ్చిబాబుతో సినిమా లాంచ్ వేడుక‌లో యాధృచ్ఛికంగానే రామ్ చ‌ర‌ణ్ `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ గురించి ప్ర‌స్థావించారు. జాన్వీతో క‌లిసి న‌టిస్తే బ్లాక్ బస్ట‌ర్ సీక్వెల్ చేయాల‌ని అభిమానులు కోరుకుంటార‌ని చ‌ర‌ణ్ అన్నారు. భ‌విష్య‌త్‌లో అలాంటి స్క్రిప్టు రెడీ అయితే దానిలో న‌టించేందుకు సిద్ధ‌మేన‌ని సిగ్న‌ల్ ఇచ్చాడు. జాన్వీ న‌టిగా షైన్ అయింది. రోజురోజుకు ప‌రిణ‌తి చెందిన న‌టిగా అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌తో మెప్పిస్తోంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించేస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ లో న‌టించే ఛాన్స్ వ‌స్తే అది త‌న కెరీర్ నే మ‌లుపు తిప్పేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. మామ్ శ్రీ‌దేవి ఇంద్ర‌జ‌గా అద్భుతంగా అభిన‌యించింది. దానికి కొన‌సాగింపు పాత్ర‌లో జాన్వీ క‌నిపించే వీలుంటుంది. కానీ టైమ్ రావాలి. దాని కోసం అభిమానులు ఇంకొంత‌కాలం వేచి చూడాల్సి ఉంది. జ‌స్ట్ వెయిట్..

Tags:    

Similar News