బలగం పాపం.. ఈ లుక్కుకి ఫిదా అవ్వాల్సిందే..

ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించింది.

Update: 2024-05-07 04:04 GMT

'వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట'.. అంటూ తొలి సినిమాతో బాలనటిగా అందరినీ ఫిదా చేసింది కావ్య కళ్యాణ్ రామ్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలు మూవీలో యాక్ట్ చేసి అదరగొట్టింది. అలా తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సందడి చేసింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మసూద మూవీతో హీరోయిన్ గా మారింది కావ్య. ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించింది.


ఇక కమెడియన్ వేణు ఎల్దండి.. డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బలగం మూవీలో ప్రియదర్శికి జోడీగా యాక్ట్ చేసింది కావ్య. ఈ సినిమాతో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. తన నటనతో అందరి మనసులు దోచుకుంది ఈ అమ్మడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంది.


కావ్య.. హీరోయిన్ గా తన మూడో సినిమా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు సింహాతో కలిసి ఉస్తాద్ లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్లు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బబ్లీ బ్యూటీ.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. తన లుక్స్ తో అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటోంది. నెట్టింట ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.

అప్పటి కన్నా కాస్త గ్లామర్ డోస్ పెంచిన కావ్య.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సందడి చేస్తుంటోంది. ట్రెడిషనల్ వేర్ లో ఎక్కువగా అలరిస్తుంటోంది. పొట్టి డ్రెస్సుల్లో కూడా స్కిన్ షో చేస్తుంటోంది. తన అందం, ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటోంది. యూత్ కు తన పోజులతో కిర్రెక్కిస్తుంటోంది. రీసెంట్ గా కొత్త ఫోటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. చీర కట్టుకుని రకరకాల హావభావాలతో మైమరిపిస్తోంది.

Read more!

బ్లాక్ కలర్ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీలో కావ్య అదరగొట్టేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బొమ్మ బ్లాక్ బస్టరే. ఓ ఫోటోలో కొంటెగా చూస్తూ.. హీట్ పుట్టించే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. తన నాభి అందాలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. మరో పిక్ లో నడుము వయ్యారంగా చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం కావ్య కొత్త పిక్స్ కు నెటిజన్లు లైకులు కొడుతూనే ఉన్నారు. ఏమా అందం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను మీరు చూశారా??

Tags:    

Similar News