• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘‘లైకా’’ మీద తమిళ...

‘‘లైకా’’ మీద తమిళ మీడియాలో గోల గోల

By - Tupaki Desk
Update: 2016-06-23 04:18 GMT
తమిళ టాప్ హీరోలు రజనీకాంత్.. కమల్ హాసన్.. విజయ్ లతో చిత్రాలు నిర్మిస్తున్న లైకా సంస్థ మీద తమిళనాడు మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు గందరగోళంగా మారాయి. ప్రస్తుతం ఆ సంస్థ రజనీకాంత్ తో 2.0 - కమల్ హాసన్ తో శభాష్ నాయుడు చిత్రాల్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ ఆర్థిక నేరాలకు పాల్పడిందని.. ఆక్రమంగా విదేశాలకు భారీ మొత్తాన్ని పంపినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు గందరగోళంగా మారాయి. అయితే.. ఇలాంటి వార్తల్లో నిజం లేదని.. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సదరు సంస్థ పేర్కొంటోంది.

ఈ సంస్థ మీద తమిళ మీడియాలో వస్తున్న వార్తల్ని చూస్తే.. పోస్టల్ శాఖ ద్వారా అక్రమంగా రూ.129 కోట్లను విదేశాలకు పంపినట్లుగా చెబుతున్నారు. ఈ సంస్థపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ శ్రీలంక కేంద్రంగా టెలికాం వ్యాపారాల్ని చేస్తుందని.. ఈ సంస్థ యజమాని అలీరాజా సుభాష్ కరణ్ కు బ్రిటన్.. ఫ్రాన్స్ లలో సిమ్ కార్డు వ్యాపారాలు ఉన్నట్లు చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 60 కార్యాలయాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కోట్లాది రూపాయాల్ని విదేశాలకు తరలిస్తున్న కేసులో ఈ సంస్థ ప్రధాన నిర్వాహకుడితో సహా 19 మందిని ఫ్రాన్స్ ఫోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వాదనల్ని సంస్థ ఖండిస్తోంది. తాజాగా వస్తున్న వార్తలు.. తమిళ చిత్ర పరిశ్రమలో గందరగోళానికి గురి చేస్తోంది.
Tags:    
  • Lyca Productions 
  • Tamilnadu Media 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS