'రామబాణం'ను ఢీ కొట్టబోతున్న అల్లరి నరేశ్!
చిన్న పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కి తొందర పడుతూ ఉండడంతో కొన్ని సినిమాల రిలీజ్ డేట్ లు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే విజయ్ కనక మెడల డైరక్షన్ లో అల్లరి నరేశ్ హీరోగా నటించిన నాంది సినిమా సూపర్ హిట్ కావడంతో వారు అదే జోష్ తో మరో సినిమా కూడా ప్రారంభించారు. ఉగ్రం పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన అంటే మరో పది రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది. కానీ అదే రోజు సమంత శాకుంతలం సినిమా రిలీజ్ కి ఉండడంతో పాటుగా తమిళ సినీ పరిశ్రమ నుంచి రుద్రుడు, బిచ్చగాడు అనే సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అల్లరి నరేశ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఉగ్రం సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎందుకు వాయిదా వేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా మే 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లు అల్లరి నరేష్ రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ధరించి భుజాల మీద ఒక రౌడీని వేసుకుని కనిపించారు. ఒకరకంగా ఇప్పటివరకు అల్లరి నరేష్ అంటే కామెడీ పాత్రలకు ఈ మధ్య కాస్త సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్లో ఆయన ఉగ్రంగా కనిపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
ఇక నిజానికి మే 5వ తేదీన గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెర ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఇప్పుడు ఈ ఉగ్రం సినిమా కూడా పోటీ పడుతుంది. ఇప్పుడిప్పుడే అల్లరి నరేష్ మార్కెట్ పుంజుకుంటుంది అలాంటి ఆయన గోపీచంద్ తో పోటీ పడుతున్నాడనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.