అవన్నీ పుకార్లు.. కోర్టులో తేల్చుకుందాం: ప్రముఖ నటి వార్నింగ్

Update: 2021-04-09 11:43 GMT
సినీ సెలబ్రిటీలపై అప్పుడప్పుడు పుకార్లు వైరల్ అవ్వడం మాములే. కానీ కొందరు మాత్రం హద్దులు మీరిన పుకార్లను సృష్టిస్తుంటారు. అసలే సోషల్ మీడియా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సెలబ్రిటీలపై వదంతులు మరీ శృతిమించి పోతున్నాయని ఇదివరకే చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయినా ట్రోల్ చేసేవారు, వదంతులు పుట్టించేవారు వందల సంఖ్యలో పుట్టుకొస్తూనే ఉన్నారు. సరదా విషయాలలో పుకార్లు సృష్టిస్తే పరవాలేదు. కానీ వ్యక్తిగత విషయాలలో, ఆరోగ్యం విషయంలో పుకార్లు సృష్టిస్తే మాత్రం ఏ సెలబ్రిటీ కూడా సహించలేదు. తాజాగా అలాంటి పుకార్లను ఎదుర్కొని ఫైర్ అయింది సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.

గతకొద్ది రోజులుగా రాధిక పై కరోనా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. రాధికా కరోనా బారిన పడిందని.. అందుకే ఆమె బయటికి రావడం లేదంటూ సోషల్ మీడియాలో వదంతులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఇన్నిరోజులు లైట్ తీసుకున్న రాధిక తాజాగా అలాంటి పుకార్లు సృష్టించిన వారి పై నిప్పులు చెరిగింది. కోవిడ్ పుకార్ల పై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాధికా.. నాపై ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. నాకు ఏ కరోనా సోకలేదు. రెండో డోస్‌ వాక్సిన్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఒళ్లు నొప్పులు అనిపించాయి. కానీ నాకేం కాలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. వర్క్ పరంగా బిజీ అయ్యాను. కానీ నా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై కొంద‌రు చెడు ప్రచారం చేస్తున్నారు. వారిని కోర్టుకు రప్పిస్తానని' ఆమె స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది.
Tags:    

Similar News