• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: 'అలిపిరికి...

ట్రైలర్ టాక్: 'అలిపిరికి అల్లంత దూరంలో' ఏం జరిగింది..?

By - Tupaki Desk
Update: 2022-11-12 11:59 GMT
ఇటీవల కాలంలో అనేక చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ క్రమంలో టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ''అలిపిరికి అల్లంత దూరంలో'' అనే చిత్రం రాబోతోంది. నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్యాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్‌ పై రమేష్ డబ్బుగొట్టు మరియు రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆనంద్ జె ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. 'అలిపిరికి అల్లంత దూరంలో' సినిమాలో నూతన నటుడు రావణ్ నిట్టూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. శ్రీ నికిత - అలంకృత షా - బొమ్మకంటి రవీందర్ - అమృత వర్షిణి సోమిశెట్టి  - లహరి గుడివాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'మా తిరుపతి' మరియు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 'అలిపిరికి అల్లంత దూరంలో' అనేది జీవితంతో పోరాడుతున్న తిరుపతిలో ఓ ఫోటోగ్రాఫర్ కథ అని తెలుస్తోంది.

ఇందులో ఒక ప్రేమకథ కూడా ఉంది. దాని చుట్టూ అల్లుకున్న ఓ రాబరీ డ్రామాని చూపించబోతున్నట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. తిరుపతిలో ఫోటో స్టూడియో పెట్టుకోవాలని కష్టపడే యువకుడు.. తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడం కోసం ఏదొక విధంగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు.

ఈ క్రమంలో అతడి వద్దకు వచ్చిన ఒక మనీ బ్యాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథ ఏమయ్యుంటుందనే ఆసక్తిని కలిగిస్తాయి. లవ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్ వంటి అన్ని అంశాలతో కట్ చేసిన 'అలిపిరికి అల్లంత దూరంలో' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

కొత్త నటీనటులతో సినిమా అంతా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసినట్లు తెలుస్తోంది. జెకె దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఫణి కళ్యాణ్ సంగీతం సమకూర్చారు. 'అలిపిరికి అల్లంత దూరంలో' చిత్రాన్ని నవంబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

తెలుగులో రాబరీ డ్రామాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. ఇక్కడ రాబరీ డ్రామాతో పాటుగా కాస్త డివోషనల్ టచ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    
  • AlipirikiAllanthaDooramlo 
  • Trailer 
  • RaavanReddy 
  • SriNikitha 
  • latestnews 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS