• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆలియా ట్యాలెంట్‌ పై...

ఆలియా ట్యాలెంట్‌ పై జక్కన్నకు ఇంత నమ్మకం ఏంటో?

By - Tupaki Desk
Update: 2020-11-09 05:15 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌ లో జరుగుతోంది. ఈ సినిమా భారీ తారాగణంతో రూపొందుతోంది. ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌ లతో పాటు అజయ్‌ దేవగన్‌ ఆలియా భట్‌ ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఇంకా హాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ముగ్గురు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ కు జోడీగా ఈ సినిమాలో హాలీవుడ్‌ ముద్దుగుమ్మ నటించనుండగా రామ్‌ చరణ్‌ కు జోడీగా సీత పాత్రలో ఆలియా నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ ఆలియా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతుంది.

తాజాగా రాజమౌళి ఒక చిట్‌ చాట్‌ లో సినిమాను ఖచ్చితంగా వచ్చే ఏడాది ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఆలియా భట్‌ ను హీరోయిన్‌ గా ఎంపిక చేయడంపై మరోసారి స్పష్టత ఇచ్చాడు. సీత పాత్ర నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. ఒక మంచి నటి మరియు అందమైన అమ్మాయి కావాలనుకున్నప్పుడు నాకు ఆలియా అయితే బాగుంటుందని అనిపించింది. ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ లకు పోటీ ఇవ్వాలంటే ఆలియా మాత్రమే సూట్‌ అవుతుంది అనిపించింది.

ఆలియా ఒక అద్బుతమైన నటి అంటూ జక్కన్న అభిప్రాయం వ్యక్తం చేశాడట. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల నటనను బ్యాలన్స్‌ చేయగల సత్తా ఆలియాకు మాత్రమే ఉంటుందనే నమ్మకం నాకు ఉందని అందుకే ఆమెను హీరోయిన్‌ గా నటింపజేస్తున్నాను అంటూ రాజమౌళి అన్నాడట. నెపొటిజం విమర్శలు విపరీతంగా ఎదుర్కొంటున్న ఆలియా ప్రతిభపై జక్కన్నకు మరీ ఇంత నమ్మకం ఏంటో అంటూ కొందరు నెటిజన్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Rrr Release Date 
  • Rrr Movie Motion Poster 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri 
  • Komaram Bheem 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS