• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR బ్యూటీ పెళ్లికి...

RRR బ్యూటీ పెళ్లికి క‌రోనా ఎఫెక్టు లేదా?

By - Tupaki Desk
Update: 2020-04-09 10:30 GMT
ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియాభ‌ట్ - ర‌ణ‌బీర్ ప్రేమాయ‌ణం ఆల్వేస్ హాట్ టాపిక్. ఇంత‌కీ ఈ జంట పెళ్లెప్పుడు? అంటే ఈపాటికే అయిపోవాల్సిన‌ది. ముంబై మీడియా హ‌డావుడి ప్ర‌కారం.. ఆ తంతు కాస్తా ముగిసి అప్పుడే కాపురం కూడా మొద‌లైపోయేదే. స‌రిగ్గా ఏడాది క్రితం న్యూయార్క్ (అమెరికా) నుంచి ర‌ణ‌బీర్ త‌ల్లిదండ్రులు ఇండియాలో అడుగు పెట్ట‌గానే అస‌లు రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. విదేశాల్లో ఇరు కుటుంబాలు కలుసుకుని ముహూర్తాలు పెట్టేసుకున్నాయ‌ని ఫ్రాన్స్ లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ కి ప్లాన్ చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత క్ర‌మంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ మార్చుకుని ముంబైలోనే భారీ గా వేడుక‌ను ప్లాన్ చేసార‌ని కొన్ని క‌థ‌నాలు వేడెక్కించాయి. స‌భ్య‌సాచి డిజైన్స్ కోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు త‌ర‌పు బృందాలు ఆర్డ‌ర్స్ ఇచ్చేశాయ‌ని కూడా కాస్త అడ్వాన్స్ డ్ గానే క‌థ‌నాలొచ్చాయి.

దీంతో అంద‌రూ నిజ‌మేన‌ని అనుకున్నారు. కానీ అవేవీ ప్రాక్టికల్ గా నిజం కాక‌పోవ‌డంతో ఆ త‌ర్వాత ఈ జంట పెళ్లి మ్యాట‌ర్ పెండింగు లో ప‌డిపోయింది. అయితే 2020 సమ్మ‌ర్ లో ఈ జంట పెళ్లాడుకునే వీలుంద‌న్న ప్ర‌చారం కూడా సాగింది. కానీ అది కూడా నిజం కాలేదు. తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి ఈసారి ముహూర్తానికి క‌రోనా అడ్డంకిగా మారిందో ఏమో! అది స‌రే కానీ.. ఈ జంట పెళ్లికి మ‌రో కొత్త ముహూర్తాన్ని ఫిక్స్ చేసేశారు మ‌రి.

ఓ ప్ర‌ముఖ జ్యోతిష్య శాస్త్ర‌జ్ఞుడి మాట మేర‌కు .. ఈ జంట పెళ్లి 2020లోనే జ‌ర‌గ‌నుంద‌ట‌. 2019 చ‌లికాలం మొద‌లు 2020లో ఏదో ఒక స‌మ‌యంలో ఈ జంట పెళ్లి జ‌రుగుతుంద‌ని ఆయ‌న ఇదివ‌ర‌కే చెప్పారు. ఈ జంట జాత‌క‌రీత్యా అందుకు ఆస్కారం ఉంద‌ని .. శుక్రుడు నిర్ధేశిస్తున్నాడ‌ని కూడా చెప్పారు. వీరి పెళ్లి విష‌యంలో కొన్ని అపార్థాల‌కు .. క‌న్ఫ్యూజ‌న్ కి ఆస్కారం ఉంద‌ని అవ‌న్నీ త్వ‌ర‌లో తొలగిపోతాయ‌ని కూడా వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే పెళ్ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రి కెరీర్ ధేధీప్య‌మానంగా వెలిగిపోతుంద‌ని కూడా చెప్పేశాడు. అన్ స్టాప‌బుల్! అని పొగిడేశారు. అన్న‌ట్టు ఆలియా.. ర‌ణ‌బీర్ న‌టించిన సినిమాలు రిలీజైపోగానే పెళ్లి జ‌రిగే ఛాన్సుందేమో అంటే ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోలంలో అందుకు ఛాన్సుందంటారా?  తాజా క‌ల్లోలాన్ని స‌ద‌రు జ్యోతిష్కుడు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు లేదే!
Tags:    
  • Alia Bhatt And Ranbir Kapoor CONFIRM Their MARRIAGE Date In 2020 
  • Alia Bhatt And Ranbir Kapoor 
  • Alia Bhatt 
  • Ranbir Kapoor 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS