పిక్ టాక్‌ : పింక్ చీరలో హీరోయిన్‌ ను మించి బిబి దేత్తడి

Update: 2021-07-03 11:58 GMT
యూట్యూబ్ లో దేత్తడి వీడియోలతో బాగా ఫేమస్ అయ్యి కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించిన హారిక కు బిగ్ బాస్ ద్వారా మరింతగా పాపులారిటీ దక్కింది. ఫైనల్‌ ఫైవ్‌ వరకు వెళ్లిన హారిక అన్ని విధాలుగా పోరాట స్ఫూర్తిని చూపించింది. స్కిట్స్ నుండి మొదలుకుని అందాల ప్రదర్శణ వరకు బిగ్‌ బాస్ లో ఆ అమ్మడి ప్రదర్శణకు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఓట్లు ఇచ్చేశారు. బిగ్‌ బాస్‌ నుండి బయకు వచ్చిన తర్వాత వెబ్‌ సిరీస్ ల్లో ఆఫర్లు దక్కించుకోవడంతో పాటు వరుసగా ఈ అమ్మడు షో ల్లో మెరుస్తూనే ఉంది. ఇక సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్‌ ను తన లైఫ్‌ స్టైల్‌ ఫొటో షూట్‌ ను షేర్‌ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఈ పింక్ సారి ఫొటో షూట్‌ ను షేర్‌ చేసింది.

పింక్ సారిలో చాలా రొమాంటిక్ గా హొయలు ఒలక బోస్తూ ఏమాత్రం ఎక్స్‌ పోజింగ్‌ చేయకుండా అలేఖ్య హారిక ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎక్స్‌ పోజింగ్ లేకుండా కూడా ఈ ఫొటోలను ఇంతగా ఆమె ఫాలోవర్స్ లైక్‌ చేస్తున్నారు. షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫొటోలకు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. హీరోయిన్‌ కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నారు అంటూ కామెంట్స్‌ పెద్ద ఎత్తున పెట్టారు. ఈ ఫొటోలు చూసి ఏ దర్శకుడో లేదా నిర్మాతనో హీరోయిన్‌ గా కూడా ఆఫర్ ఇస్తాడని ఆమె అభిమానులు అంటున్నారు. వరుసగా ఆమె హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. కాని ఈసారి మాత్రం ఆమె కాస్త డోసు తగ్గించినా కూడా చీర కట్టులో అది కూడా కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తూ ఉండటం వల్ల ప్రేక్షకులు మరియు అభిమానులు ఆ ఫొటోలను తెగ లైక్ చేస్తున్నారు.

ఇక హారిక కెరీర్ విషయానికి వస్తే వరుసగా ఏదో ఒక వెబ్‌ సిరీస్.. సినిమాల్లో పాత్రలు మరియు బుల్లి తెరపై షోలతో ఆకట్టుకుంటూ ఉంది. ముందు ముందు ఈమె వెండి తెరపై బిజీ ఆర్టిస్టుగా మారిపోవాలని కోరుకుంటుంది. మరో వైపు ఈమె తన యూట్యూబ్‌ ఛానెల్‌ దేత్తడిలో కూడా వరుసగా వీడియోలను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. బిగ్‌ బాస్‌ కు ముందు బిగ్‌ బాస్ తర్వాత అన్నట్లుగా ఈ హారిక పేరు మారిపోయింది. బిగ్‌ బాస్ లో ఉన్న సమయంలో కాస్త విమర్శలు వచ్చినా బయటకు వచ్చిన తర్వాత ఆమెకు పూర్తిగా అభిమానులు మద్దతు తెలుపుతూ ఉన్నారు.
Tags:    

Similar News