ఫోటో స్టోరి: అన‌న్య సోద‌రి అల్లాడిస్తోందిగా..!

Update: 2021-05-25 23:30 GMT
లైగ‌ర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది అన‌న్య పాండే. ఈ భామకు అల‌నా పాండే అనే క‌జిన్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇంచుమించు అన‌న్య ఫీచ‌ర్స్ తోనే ఈ అమ్మ‌డు కూడా అద‌ర‌గొట్టేస్తోంది. ఈ బ్యూటీ అన‌న్య తండ్రి చంకీ పాండేకి మేనకోడలు. అలన్నా పాండే బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ డీన్ పాండే కుమార్తె.

అలన్నా పాండేకు సోషల్ మీడియా వేదిక‌గా అంద‌రి దృష్టిని ఎలా ఆకర్షించాలో బాగా తెలుసు. ఈ బ్యూటీ మాంచి ట్రావెల్ ఫ్రీక్.. అలన్నా వివిధ దేశాలను అన్వేషించడానికి ఇష్టపడుతుంది. బీచ్ వెకేషన్ అంటే చెవి కోసుకుంటుంది. ఇప్ప‌టికే అల‌న్నా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తున్నాయి.

అల‌న్నాకు ఇన్ స్టాగ్రామ్ లో 400 కె కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలన్నా తన స్టైలిష్  గ్లామరస్ ఫోటోల‌తో అంత‌కంత‌కు హీట్ పెంచేస్తుండ‌డంతో ఫాలోయింగ్ వేగంగా పెరుగుతోంది. ఇటీవ‌ల ఈ బ్యూటీ విదేశీ బీచ్ ల‌లో సెలవు దినాల్లో చిల్లింగ్ చేస్తోంది. ఇంటర్నెట్ సెన్సేషన్ అలన్నా ఒక ఫ్యాషన్ స్టూడెంట్. తన అద్భుతమైన క్రియేటివ్ గెట‌ప్పుల‌తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు.

ఆమె ఏస్ ఫ్యాషన్ డిజైనర్ మోనిషా జైసింగ్ కుమారుడు యుడి జైసింగ్ తో డేటింగ్ చేస్తోంది. అలన్నా - యుడి ఒకరితో ఒకరు డేటింగ్ లో ఉన్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. అల‌న్నా ఫీచ‌ర్స్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లు ఫిదా అయిపోవ‌డం ఖాయం. ముఖ్యంగా అన‌న్య‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్న పూరి ఈ బ్యూటీకి అవ‌కాశం క‌ల్పిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News