• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పీఎం కేర్స్ ఫండ్'కు...

'పీఎం కేర్స్ ఫండ్'కు అక్షయ్ కుమార్ భారీ విరాళం

By - Tupaki Desk
Update: 2020-03-28 16:01 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతున్న దేశాల ఆర్థిక స్థితి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి అత్యధిక జనాభా ఉన్న దేశాలలో కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా కట్టడికి భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ కు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సహాయక చర్యలకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, సినీ తారలు తమ వంతు విరాళాలిచ్చారు. ఈ క్రమంలోనే కరోనా సహాయక చర్యల కోసం ప్రధాని మోడీ 'పీఎం కేర్స్ ఫండ్' పేరుతో విరాళాల సేకరణ ప్రారంభించారు. ప్రధాని పిలుపునకు స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్....ఆ నిధికి భారీ విరాళమిచ్చారు. కరోనాపై పోరాటంలో తన వంతుగా రూ.25 కోట్లను 'పీఎం కేర్స్ ఫండ్'కు విరాళమిస్తున్నానని అక్కీ ట్వీట్ చేశాడు. గొప్ప పని చేశావంటూ అక్షయ్ కుమార్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపిస్తూ రీట్వీట్ చేశారు.


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లేకుండా...నెపోటిజం ఛాయలు పడకుండా స్టార్ హీరోగా అంచెలచలుగా కష్టపడి ఎదిగిన అసలు సిసలు హీరో అక్కీ. విలక్షణ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం బాద్షాలుగా బాలీవడ్ ను ఏలుతున్న సమయంలో....విలక్షణ కథాంశాలతో వరుస హిట్ సినిమాలు చేశాడు అక్సయ్. టాయిలెట్, ప్యాడ్ మ్యాన్, గోల్డ్, రుస్తుం వంటి సందేశాత్మక, దేశభక్తి చిత్రాలలో నటిస్తూనే బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు. సంపాదనే కాకుండా సామాజిక కార్యక్రమాలలోనూ అక్కీ ముందుంటాడు. ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్న అక్షయ్...పలు అంశాలపై తన వంతుగా ప్రజలను చైతన్య పరుస్తుంటాడు. తాజాగా కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరులోనూ అక్కీ నేను సైతం అన్నాడు. ప్రధాని ఇచ్చిన పిలుపునకు వెంటనే స్పందించి 'పీఎం కేర్స్ ఫండ్‌'కు రూ.25 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. ఇంత భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన తొలి బాలీవుడ్ హీరో అక్షయ్ కావడం విశేషం. ఇది మన ప్ర‌జ‌ల జీవితాల‌ని కాపాడుకోవ‌ల‌సిన స‌మ‌యమని, మ‌న‌కి తోచినంత సాయం చేయాలని కోరుతున్నానని అక్కీ ట్వీట్ చేశాడు. తన వంతు విధిగా 'పీఎం కేర్స్ ఫండ్‌'కు రూ.25 కోట్ల విరాళాన్ని అందిస్తున్నానని, ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్లేనని.. మనల్ని మనం రక్షించుకుందాం..అని అక్షయ్ చేసిన ట్వీట్ ఎందరికో స్ఫూర్తిదాయకం.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • Akshay Kumar 
  • 25 crores 
  • PM cares fund 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS