• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కినేని హీరోకు ఇది...

అక్కినేని హీరోకు ఇది సెకండ్‌ ఇన్నింగ్స్‌ కానుందా!?

By - Tupaki Desk
Update: 2021-07-14 01:30 GMT
అక్కినేని ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాగేశ్వరరావు తర్వాత నాగార్జున మాత్రమే ఇండస్ట్రీలో స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు నాగచైతన్య మరియు అఖిల్‌ లు హీరోలుగా స్టార్ డమ్‌ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున హీరోగా టాప్ పొజీషన్‌ లో కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగేశ్వరరావు కూతురు తనయుడు అయిన సుమంత్‌ ఎంట్రీ ఇచ్చాడు. సుమంత్‌ కెరీర్‌ ఆరంభం నుండి ఒడిదొడుకులు చూస్తూ వచ్చాడు. కెరీర్‌ ఆరంభంలోనే ప్లాప్‌ లు పడటంతో సుమంత్‌ కెరీర్‌ కాస్త కష్టాల మద్య సాగింది. ముందు ముందు కుదురు కుంటుంది అని అక్కినేని ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ భావించింది. కాని సుమంత్‌ కెరీర్‌ ఆరంభించి ఇరవై ఏళ్లు దాటినా కూడా కమర్షియల్‌ గా సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు.

నాలుగు పదుల వయసు లో సుమంత పడి చాలా కాలం అయ్యింది. కనుక ఆయన ఇంకా హీరోగా సక్సెస్‌ అవుతాడని ఏ ఒక్కరు అనుకోవడం లేదు. ఆయన లో మంచి నటుడు ఉన్నాడు కాని అదృష్టం కలిసి రాకపోవడం వల్ల ప్లాప్ లు పడ్డాయి. నటుడిగా సక్సెస్ అయిన సుమంత్‌ హీరోగా కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోవడం లో విఫలం అయ్యాడు. అందుకే సుమంత్‌ మెల్ల మెల్లగా సినిమాలకు దూరం అవుతున్నాడంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కాని ఆయన తనకున్న పరిచయాలతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం కూడా ఆయన సినిమాలు ఒకటి రెండు సెట్స్‌ పై ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టే యోచనలో ఉన్నాడా అంటే అవును అంటూ ఇండస్ట్రీ లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరోలుగా నటించిన జగపతి బాబు నుండి మొదలుకుని శ్రీకాంత్‌ వరకు చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా లేదా విలన్స్ గా కొనసాగుతున్నారు.

అన్ని భాషల్లో సీనియర్‌ హీరోలు కెరీర్‌ ను కొనసాగించాలంటే నాలుగు లేదా అయిదు పదుల వయసు దాటిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టులు గా మారుతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఆరు పదుల వయసులో కూడా హీరోలుగా కొనసాగుతున్నారు అది వేరే విషయం. సుమంత్‌ నాలుగు పదుల వయసు లో ఉన్నాడు కనుక ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టేయ వచ్చు అంటూ కొందరు సూచిస్తున్నారు. సుమంత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ అని కాదు కాని త్వరలో ఒక సినిమా లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహానటి మేకర్స్‌ నిర్మాణంలో లెఫ్టినెంట్‌ రామ్‌ అనే సినిమా రూపొందబోతుంది. ఈ సినిమా కు అందాల రాక్షసి ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహించబోతున్నాడు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించబోతున్నట్లుగా చాలా నెలల క్రితమే వార్తలు వచ్చాయి.

మహానటి తర్వాత దుల్కర్‌ నటించబోతున్న మరో డైరెక్ట్‌ తెలుగు సినిమా ఇదే. ఆయన ఇప్పటికే ఈ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఎప్పుడంటే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడట. ఇన్ని రోజుల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ జరిపిన హను రాఘవపూడి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో పడ్డాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం ఒక సెట్‌ నిర్మించడంతో పాటు నటీ నటులను ఎంపిక చేస్తున్నాడట. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం సుమంత్‌ ను సంప్రదించగా ఆయన వెంటనే ఒప్పుకున్నాడట. సినిమాలో సుమంత పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తో సుమంత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి సుమంత్‌ పాత్రకు పేరు వస్తే మాత్రం క్యారెక్టర్‌ ఆర్టిస్టు గా సుమంత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Tags:    
  • Akkineni Sumanth 
  • Second innings 
  • Dulquer Salmaan Movies 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS