ఫస్ట్ టైం అఖిల్ అలాంటి పని చేశాడట

Update: 2016-09-28 05:30 GMT
అక్కినేని హీరోలకు ప్రస్తుతం ఓ పండగ మొదలైపోతోంది. దసరా పండగతో పాటు.. మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తున్న ప్రేమమ్ రిలీజ్ దగ్గర పడ్డంతో.. అందరూ బోలెడంత హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ గా జరిగిన ఆడియో ఫంక్షన్ లో అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి కనిపించడం.. అభిమానులకు కన్నుల పండుగగా మారింది.

ప్రేమమ్ ఆడియో లాంఛ్ సమయంలో.. అఖిల్ చేతిలో ఉన్న ఫోన్.. ఆ ఫోన్ లో కనిపిస్తున్న కనిపిస్తున్న స్క్రీన్ సేవర్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వచ్చింది. అఖిల్ ఫోన్ లో కనిపిస్తున్న ఏఎన్నాఆర్ ఫోటోను పాయింట్ చేస్తూ.. తాతయ్యను అఖిల్ ఎంతో అభిమానిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు. దీనికి రిప్లై ఇచ్చిన అఖిల్.. 'నేను సహజంగా ఇలాంటి ట్వీట్స్ పెట్టను. కానీ నీకు చాలా తీక్షణమైన దృష్టి ఉంది ఫ్రెండ్. అసలు నమ్మలేకపోతున్నా. ఇది మొదటిసారి చూసినపుడు నవ్వుతూనే ఉన్నా' అంటూ ట్వీట్ పెట్టాడు అఖిల్ అక్కినేని.

అటు నాగ చైతన్య ప్రేమమ్ ను.. ఇటు సుమంత్ నరుడా డోనరుడా చిత్రాల గురించి వరుసగా ట్వీట్స్ చేస్తూ.. పబ్లిసిటీ చేస్తున్న అఖిల్.. తను హీరోగా నటించే మూవీ కోసం కూడా రెడీ అయిపోతున్నాడు. విక్రమ్ కె కుమార్ తో మూవీ ఇప్పటికే ఖాయం కాగా.. ఆగిపోయిందని అనుకున్న హను రాఘవపూడి ప్రాజెక్టు కూడా మళ్లీ పట్టాలెక్కే ఛాన్సులున్నాయని అంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News