• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రుద్రాక్ష ట్రోల్స్‌ పై...

రుద్రాక్ష ట్రోల్స్‌ పై అఖిల్ రియాక్ట్‌

By - Tupaki Desk
Update: 2021-10-15 03:30 GMT
అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో అఖిల్ చాలా స్టైలిష్‌ లుక్ లో కనిపించాడు. విభిన్నమైన హెయిర్ స్టైల్‌ తో పాటు డిజైనర్‌ డ్రస్ లతో మెప్పించాడు. ఎక్కువ శాతం అఖిల్‌ తన చేతికి రుద్రాక్ష దండను చుట్టుకుని కనిపించాడు. ఈ మద్య కాలంలో యువకులు ఇలాంటి ట్రెండ్‌ ను ఫాలో అవుతున్నారు. స్టైల్‌ కోసం అన్నట్లుగా అమ్మాయిలు కూడా రుద్రాక్ష ను చేతికి చుట్టుకోవడం ఫ్యాషన్ అయ్యింది.
ఫ్యాషన్‌ కోసం రుద్రాక్ష మాలను చేతికి స్టైల్‌ గా ధరించడంను కొందరు హిందుత్వ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదని.. రుద్రాక్ష అంటే శివుడి స్వరూపంగా భావిస్తాం. కనుక అలా చేయకూడదు అంటూ కొందరు అంటున్నారు.

అఖిల్‌ కూడా రుద్రాక్ష మాలను ధరించండంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సెలబ్రెటీ రుద్రాక్ష మాలను చేతికి చుట్టుకోవడం ద్వారా ఇతరులకు కూడా దీన్ని అలవాటు చేసిన వారు అవుతారు అంటూ కొందరు అఖిల్‌ తీరును విమర్శిస్తున్నారు. తాజాగా అఖిల్‌ ఈ విషయమై స్పందించాడు. తాను రుద్రాక్షను చేతికి కట్టుకున్నది స్టైల్‌ కోసం మాత్రం కాదని క్లారిటీ ఇచ్చాడు. తనకు రుద్రక్ష చేతికి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఒకరు చెప్పారు. అందుకే ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి నేను నా చేతికి ధరించినట్లుగా చెప్పుకొచ్చాడు. అఖిల్ భక్తితోనే రుద్రాక్షను ధరించడం అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికి అయినా ట్రోల్స్ ఆగుతాయని ఆశిద్దాం.

ఇక మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్ దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా రూపొందిన ఈ సినిమా లో అఖిల్‌ విభిన్నమైన పాత్రను పోషించాడు. అఖిల్‌ మరియు పూజా హెగ్డేల రొమాన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అఖిల్‌ అక్కినేనికి మొదటి కమర్షియల్‌ బ్రేక్‌ ను ఇస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.


Tags:    
  • Akhil 
  • Latest news 
  • Tollywood 
  • Movie news 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS