అఖిల్ 'ఏజెంట్' లో బాస్ పార్టీ...!
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు. వాయిదాలు పడుతున్నా కొద్ది సినిమా పై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న అఖిల్ 'ఏజెంట్' సినిమా లో మాస్ ఐటం సాంగ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి సర్ ప్రైజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ను ఏజెంట్ చిత్రంలో ఐటం సాంగ్ కు గాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ కి మంచి స్పందన దక్కిన విషయం తెల్సిందే. అందంతో పాటు డాన్స్ మరియు అప్పియరెన్స్ విషయంలో హాట్ ఐటం బ్యూటీ ఊర్వశి రౌతేలా మంచి గుర్తింపును దక్కించుకుంది. అందుకే ఏజెంట్ మేకర్స్ బాస్ పార్టీ బ్యూటీని ఎంపిక చేయడం జరిగిందని.. కాస్త ఎక్కువ బడ్జెట్ అయినా కూడా సినిమాకు కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడిని రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అఖిల్ లుక్ తో పాటు పాత్ర అభిమానులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సర్ ప్రైజ్ చేసే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇన్నాళ్ల వెయిటింగ్ కు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదని కూడా వారు హామీ ఇస్తున్నారు.
సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ తో చేసే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉంది. అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్న కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను ఏజెంట్ తీసుకు వచ్చేనా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రాబోతుంది.