• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అఖండ' టైటిల్ సాంగ్:...

'అఖండ' టైటిల్ సాంగ్: అఘోరా గా గర్జించిన బాలయ్య..!

By - Tupaki Desk
Update: 2021-11-08 07:32 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. బాలకృష్ణ ద్విపాత్రాభినయం ప్లే చేస్తున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రెండు పాత్రలకు సంబంధించిన టీజర్లు - ప్రచార చిత్రాలు - ఫస్ట్ సింగిల్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఖండ టైటిల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

దీపావళి సందర్భంగా టైటిల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. నందమూరి అభిమానులను విశేషంగా అలరించింది. తాజాగా విడుదలైన ఫుల్ సాంగ్ వారికి గూస్ బమ్స్ తెప్పిస్తోంది. 'ఖం ఖం ఖంగుమంది శంఖం.. భం అఖండ.. భం భం అఖండ..' అంటూ సాగిన ఈ పాటలో అఘోరాగా బాలయ్య చాలా పవర్ ఫుల్ గా ఉన్నారు. త్రిశూలం పట్టుకుని విధ్వంసకరంగా కనిపించారు. థియేటర్ లో ఈ అఖండ గర్జన, ఫ్యాన్స్ కు పూనకలు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు.

'అఖండ' టైటిల్ సాంగ్ కు ఎస్ఎస్ థమన్ మాస్ ట్యూన్ సమకూర్చగా.. బాలకృష్ణ అఘోరా పాత్రను ఎలివేట్ చేసేలా అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్ - సిద్దార్థ్ మహాదేవన్ - శివమ్ మహదేవన్ ల గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. సి రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.

‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన 'అఖండ' టైటిల్ సాంగ్ అంచనాలను రెట్టింపు చేసింది. విజువల్ గా ఇది నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని హింట్ ఇచ్చారు.

'అఖండ' చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు - శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.


Full View
Tags:    
  • Akhanda 
  • Title Song 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Copyright @2026

Powered by Blink CMS