త్రిష అఫర్ ను కొట్టేసిన ఐశ్వర్య

Update: 2018-07-04 12:11 GMT
ఏ ఇండస్ట్రీలో అయినా ఒక హిట్టు కొట్టినంత మాత్రాన హీరోయిన్స్ బిజీ అయిపోరు. దానికి అందంతో పాటు కాస్తంత లక్కు కూడా ఉండాలి. కోలీవుడ్ లో అయితే ఒక్క హిట్టు కొట్టే ముద్దు గుమ్మలకు వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. డేట్స్ ఇవ్వడానికి కాల్షీట్స్ కొంచెం కూడా ఖాళీ ఉండవు. ప్రస్తుతం అలాంటి బ్యూటీల్లో ఐశ్వర్య రాజేష్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోందనే చెప్పాలి. అమ్మడు చేస్తున్న సినిమాలు చాలా వరకు మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి.

అయితే రీసెంట్ గా అమ్మడు ఏకంగా సీనియర్ హీరోయిన్ కు రావలసిన అవకాశాన్ని తనే కొట్టేసింది. విక్రమ్ కథానాయకుడిగా కమర్షియల్ హిట్స్ అందుకునే హరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2003లో వచ్చిన హిట్టు సినిమా స్వామి కథకు సీక్వెలే ఈ స్వామి స్క్వేర్. అసలైతే త్రిష ఒరిజినల్ క్యారెక్టర్ చేయాలి. కానీ ఆమెకు చిత్ర యూనిట్ కి వచ్చిన కొన్ని విబేధాల కారణంగా సినిమా నుంచి తప్పకునున్నారు.

దీంతో ఆ అవకాశాన్ని ఐశ్వర్య రాజేష్ కు అందింది. ఇప్పటికే విక్రమ్ తో ఈ బ్యూటీ ఒక సినిమా నటిస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవ నట్చత్తిరమ్ సినిమా షూటింగ్ ఎండింగ్ లో ఉంది. విక్రమ్ సరికొత్త పాత్రలో కనిపించబోయే  ఈ సినిమా ఐశ్వర్య పాత్ర కూడా అందరిని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమాకు ఎంతవరకు రిలీజ్ అవుతుందో చూడాలి.



Tags:    

Similar News