చెల‌రేగి కామెంట్లు చేస్తున్న శ‌ర్మా గాళ్ .. ఇలా అయితే క‌ష్ట‌మే

Update: 2020-10-28 11:30 GMT
చిరుత గాళ్ నేహా శర్మ సోదరి.. నటి-మోడల్ ఈషా శర్మ ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.  మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది. లాక్మే .. పెప్సి తో సహా పలు ప్రముఖ బ్రాండ్ లకు  ఫేవ‌రెట్ ముఖచిత్రంగా నిలిచింది. 2016 లో.. ఆమె కింగ్ ‌ఫిషర్ క్యాలెండర్ గాళ్స్ లో ఒకరిగా కూడా కనిపించింది. ఆయుష్మాన్ ఖుర్రానా ఇక్ వారీ వీడియో సాంగ్ లో తొలిగా కనిపించింది. హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ్ జయతే (2018) చిత్రంలో జాన్ అబ్రహం.. మనోజ్ బాజ్ ‌పేయిలతో కలిసి శర్మ గాళ్ నటించింది.

ఈ అమ్మ‌డు వెరీ గుడ్ సైక్లిస్ట్ అన్న సంగ‌తి తెలిసిన‌దే. అథ్లెటిక్ ఫీట్స్ లో శ‌ర్మా గాళ్ దుమ్ము రేపేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో సైకిల్ పై యోగా కం స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్న ఫోటోని షేర్ చేసింది ఐషా.. ఇన్ స్టాలో ఇలాంటి ఫోటోల‌తో అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది ఈ అమ్మ‌డు. ఇక నిరంత‌రం జిమ్ ఫోటోలు వీడియోల‌తోనూ పాపుల‌రైంది.

తాజాగా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసిన ఓ కామెంట్ దుమారం రేపుతోంది. ``యు ఆర్ క్రేజీ టు ఎవ్వెరి వ‌న్ ..హూ కాంట్ మ్యానిప్యులేట్ యు.... ఫ‌కాల‌జీ`` అంటూ మాసీ క్యాప్ష‌న్ తో కుర్ర‌కారు గుండెల్లోకి దూసుకుపోయింది. ఐషా ప్ర‌స్తుతం వరుస‌గా క్రేజీ బ్యాన‌ర్ల‌కు సంత‌కాలు చేసేందుకు రెడీ అవుతోంద‌ట‌. ఇటు సౌత్ లోనూ అడుగు పెట్టాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇక ఇక్క‌డ హాట్ ఐటెమ్ నంబ‌ర్ల‌లో ఆఫ‌ర్ వ‌స్తే కాద‌నే ఛాన్సే లేదు మ‌రి. సౌత్ లో ఆ ఒక్క ఛాన్స్ ద‌క్కుతుందా లేదా చూడాలి.
Tags:    

Similar News