తనుశ్రీపై దాడి వీడియో.. నానాకి కష్టమేనా?

Update: 2018-10-01 09:37 GMT
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో 2008 లో ఒక షూటింగ్ సమయంలో వేధింపులకు గురయ్యానని చెప్పడం పెనుదుమారాన్ని సృష్టించింది. 'హార్న్ ఒకే ప్లీజ్' సినిమా పాట షూటింగ్ జరిగేసమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.  ఆరోజు నానాతో షూటింగ్ చేయనని చెప్పినందుకు రౌడీలతో తనపై దాడి చేయించాడని కూడా ఆరోపణలు చేసింది.

ఇక తాజాగా ఆ దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తనుశ్రీ తన పేరెంట్స్ తో కలిసి వెళుతుండగా కొందరు ఆమె కారును అడ్డుకున్నారు.  కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు.  ఒకరు కారెక్కి పైకి కిందకి గెంతాడు.   టైర్లకు కాలి కూడా తీసేశారు.  ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నిర్మాత.. జర్నలిస్ట్ అయిన ఝాన్సీ సెక్యూరా ఈ ఘటన సంబంధించి మరికొన్ని వివరాలను బయటపెట్టింది.  ఆరోజు 'హార్న్ సౌండ్ ప్లీజ్' చిత్ర షూటింగ్ కు తనుశ్రీ హాజరైందని..  కొన్ని షాట్స్ చిత్రీకరించిన తరువాత నానా పాటేకర్ కూడా స్టూడియోకి వెళ్లాడని.. ఆతర్వాత కొద్ది సేపటికే తనుశ్రీ బయటకు వచ్చేసిందని తెలిపింది. అప్పుడే తనుశ్రీ కారుపై దాడి జరిగిందని తెలిపింది.

ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.  దాడి వీడియో బయటకు రావడంతో ఇది నానాకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందని అంటున్నారు. పైగా ఆ దాడి తర్వాత కూడా నానా తనను వేధిస్తూనే ఉన్నాడని కూడా ఆరోపణలు చేసింది.  బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఈ విషయం పై స్పందిస్తూ..  దాడిపై విచారణ జరిపించాలని  కోరింది.  దాడి సమయంలో తనుశ్రీ దత్తా ధైర్యంగా ఉండడం చాలా గొప్ప విషయమని ప్రశంసించింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News