రెండో సినిమాకే 70ల‌క్ష‌లు అడిగిందా?

Update: 2022-02-16 06:00 GMT
నేటిత‌రం క‌థానాయిక‌లు దీపం ఉండ‌గానే చక్క‌బెట్టేస్తున్నారు. క్రేజ్ ఉండ‌గానే వెంట‌ప‌డే నిర్మాత‌ల ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేస్తున్నారు. ఇప్పుడు అదే తీరుగా ఈ కుర్ర‌బ్యూటీ కూడా భారీగా వ‌సూల్ చేస్తోందిట‌. ఒక్కో క‌మిట్ మెంట్ కి 70ల‌క్ష‌లు పైగా పారితోషికం అందుకుంటూ వ‌న్ ఫిలిం వండ‌ర్ నిజంగానే అద్భుతాలు చేస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ అంటే.. శ్రీ‌లీల‌.

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్ స‌ర‌స‌న న‌టించింది ఈ బ్యూటీ. మూవీలో త‌న న‌ట‌న అంద‌చందాలు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌తులు చెడ‌గొట్టాయి. అందుకే వెంట వెంట‌నే ఆఫ‌ర్లు ఇస్తున్నారు. వైష్ణ‌వ్ తేజ్.. న‌వీన్ పోలిశెట్టి లాంటి క్రేజీ హీరోల సినిమాల‌కు క‌మిటైంది. ఈ సినిమాల‌కు ఒక్కో మూవీకి పారితోషికంగా 70ల‌క్ష‌లు పైగా అందుకుంటోంద‌ట‌.

తాజా స‌మాచారం మేరకు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ- అనీల్ రావిపూడి మూవీ కోసం శ్రీ‌లీల‌ను సంప్ర‌దించార‌ట‌. న‌ట‌సింహాకు కూతురి పాత్ర అది. క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన పాత్ర అని తెలిసింది. కానీ శ్రీ‌లీల చెప్పిన పారితోషికం విని నిర్మాత‌లు షాక్ తిన్నార‌ట‌.

త‌న‌ను స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు తెలిసింది. మ‌రోవైపు ఈ మూవీలో మీరా జాస్మిన్ బాల‌య్య స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మీరా జాస్మిన్ ఇటీవ‌ల మేకోవ‌ర్ తో దూసుకు రావ‌డంతో త‌న‌కు నాయిక‌గా అవ‌కాశం క‌ల్పించ‌నున్నార‌ట‌. ర‌వితేజ భ‌ద్ర‌తో బంప‌ర్ హిట్ కొట్టిన మీరా జాస్మిన్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గుడుంబా శంక‌ర్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News