అమెరికాలో హ‌బ్బీ ఎఫైర్..ఇండియాలో ఆ న‌టి!

Update: 2022-05-15 05:30 GMT
బాలీవుడ్ సీనియర్ నటి ముంతాజ్ 70 వ దశకంలో ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.  1960 లో మొదలైన ముంతాజ్ ప్రస్తానం  రెండు దశాబ్ధాల పాటు తిరుగులేకుండా సాగింది.  `సోనికి చిడియా` సినిమాతో 11 ఏళ్ల వయసులోనే వెండి తెరపై మెరిసింది. 1990 లో రిలీజ్ అయిన` అంధియాన్` చిత్రంతో ఆమె సినిమా కెరీర్ ముగిసింది.

బాలీవుడ్ చరిత్రలో రాశీఖన్నాకి ఎక్కువ హిట్లు ఇచ్చిన హీరోయిన్ గా ముంతాజ్ కి మంచి పేరుంది. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ముంతాజ్ వయసు 70 ఏళ్లు. ముంతాజ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపార వేత్త మయూర్ మాధవని వివాహం చేసుకున్నారు. అయినా అమె నటజీవితం తదుపరి సానసాగించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముంతాజ్ భర్త సహా ఆమె గురించి కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. పెళ్లి తర్వాత తన భర్త వేరొకరితో ఎఫైర్ నెరిపారని చెప్పుకొచ్చారు.  మగవాళ్లకు ఎఫైర్లు సహజం. నాకు తెలిసి మా ఆయనకు ఒక్కరే ఉండేవారు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా ఆయనే నాకు చెప్పారు. అలాగని నన్ను తక్కువ చేయలేదు. ఎంతో ప్రేమగా చూసుకునేవారు.

ముంతాజ్ నువ్వు నా భార్యవి..నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పటికీ నీ చేయి వదిలిపెట్టనని చెప్పేవారు. కానీ నేను చాలా మొండిదాన్ని. ఆ విషయంలో అంతన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయాను. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అతడి వివాహేతర సంబంధం  గురించి తెలిసాక ఒటరినయ్యా. ఎంతో బాధ కల్గింది.

అమెరికా నుంచి వెంటనే ఇండియాకి వచ్చేసాను. బాధలో ఉన్న సమయంలో ఎవరైనా దారిస్తే వారికి దగ్గరవుతాం. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ అంత సీరియస్ కాకముందు ఆ కథ ముగిసిపోయింది.  నేను ఎంతో గొప్పగా బ్రతికాను. కానీ నా నుంచి నా భర్త ఏదీ ఆశించలేదు. నేను అనారోగ్యానికి గురయ్యానంటే ఏడ్చినంత పనిచేస్తారు. నేనంటే అంత ప్రేమ కురిపిస్తారు. కానీ నేను అతనితో అడ్జస్ట్ కాలేకపోయాను`` అని తెలిపారు.

ఈ దంప‌తులిద్ద‌రు ఇప్ప‌టికీ  వేర్వేరుగానే ఉంటున్న‌ట్లు తెలుస్తుంది. మ‌యూర్ వ్యాపారాల‌ నిమిత్తం అమెరికాలో  స్థిర‌ప‌డ‌గా..ముంతాజ్  అత‌ని వివాహేత‌ర సంబంధం కార‌ణంగా ఇండియాకి తిరిగొచ్చి ఇక్క‌డే స్థిర‌ప‌డ్డారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు క‌ల‌రు. న‌టాషా..తాన్య అనే ఇద్ద‌రు పిల్లలు ఉన్నారు. కానీ  వీళ్లెవ్వ‌రూ సినిమా రంగంలోకి వ‌చ్చిన‌ట్లు లేదు. చ‌దువులు అనంత‌రం వేర్వేరు రంగాల్లో స్థిర‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది.
Tags:    

Similar News