లైంగిక వేధింపులతో వార్తల్లోకి కమల్

Update: 2020-04-27 09:30 GMT
తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని కమల్ అనే సినీ ప్రముఖుడిపై ఒక నటి ఫిర్యాదు చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త చూసి అందరూ కమల్ హాసన్ గురించి అని ప్రచారం చేశారు. కానీ నిజానికి ఈ వివాదం వచ్చింది తమిళ అగ్రనటుడు కమల్ హాసన్ మీద కాదు.. మలయాళ దర్శకుడు కమల్ మీద.. కమల్ హాసన్ పేరు ఈయన పేరు ఒకేలా ఉండేసరికి అందరూ కమల్ హాసనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అనుకున్నారు. కానీ ఇది శుద్ధ అబద్దం..

ప్రముఖ దర్శకుడు, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ చైర్మన్ కమల్ తనను లైంగికంగా వేధించాడని ఓ మాలీవుడ్ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తనకు ‘ప్రణయ మీనుకలుడే కాదల్’ సినిమాలో అవకాశం ఇస్తానని.. దానికి ప్రతిఫలంగా కోరిక తీర్చమన్నాడని ఫిర్యాదులో ఆ నటి పేర్కొన్నారు.

2018లో మంజూ వారియర్ ప్రధాన పాత్రలో కమల్ తెరకెక్కించిన ‘ఆమి’ షూటింగ్ సమయంలో ఇదంతా జరిగిందని నటి తెలిపింది. కమల్ తనను షూటింగ్ సమయంలో వేధించాడని.. తన ఫ్లాట్ కు తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించాడని.. తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె ఆరోపించారు. లైంగిక వేధింపులపై 2019 ఏప్రిల్ 26న దర్శకుడికి లీగల్ నోటీసులు పంపినట్టు ఆమె వెల్లడించారు.

ఇక నటిని లైంగిక వేధించాడన్న ఆరోపణలపై  దర్శకుడు కమల్ స్పందించారు. తన పేరును చెడగొట్టేందుకు ఇలా నటి నిరాదర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

    

Tags:    

Similar News