సెట్ పై దాడి.. డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ కు గాయాలు

Update: 2019-06-20 07:50 GMT
ఎఎల్టీ బాలాజీ వారి నిర్మాణంలో 'ఫిక్సర్' అనే వెబ్ సీరీస్ ను రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ షూటింగ్ థానేలో సాగుతోందట.  అయితే బుధవారం సాయత్రం 4 గంటల సమయంలో నలుగురు గూండాలు వచ్చి యూనిట్ మెంబర్స్ పై దాడి చేశారని 'ఫిక్సర్' టీమ్ సభ్యులు చెప్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ మాహీ గిల్ మాట్లాడుతూ తనపై కూడా గూండాలు దాడి చేశారని వెల్లడించింది.

"ఉదయం 7 గంటల నుండి మేము షూటింగ్ జరుపుతూ ఉన్నాం.  సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇనుప రాడ్లు.. కర్రలు పట్టుకొని నలుగురు గూండాలు వచ్చారు.  దొరికిన వారిని దొరికినట్టు కొట్టడం ప్రారంభించారు.  అందరూ తప్పతాగి ఉన్నారు. నన్ను కొట్టబోయేలోపు నేను కార్ దగ్గరకు వెళ్లి తప్పించుకున్నాను. మా దర్శకుడు సోహమ్ షా ను నేలమీద పడేసి తీవ్రంగా కొట్టారు.  ఆయనకు తలపై కట్టు కట్టాల్సి వచ్చింది.  ఆయనను కొడుతూ ఉంటే ఆపాడానికి వెళ్ళిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ తుండ్యాల్  ను దుండగులు కూడా కొట్టారు. ఆయనకు భుజం డిస్లొకేట్ అయింది.  వ్యానిటీ వ్యాన్ ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. నా డ్రైవర్ పై కూడా దాడి చేసి కొట్టారు.  పోలీసులు వచ్చారు కానీ వాళ్ళు కూడా గూండాలకు మద్దతు పలికారు" అంటూ జరిగిన విషయాన్ని మాహీ గిల్ వెల్లడించింది.

మరో వైపు ఈ సంఘటన గురించి వివరిస్తున్న నిర్మాత సాకేత్ సావ్ని వీడియో ను తన ట్విట్టర్ ఖాతా ద్వా షేర్ చేసింది. ఆయన జరిగిన వివరిస్తూ "మేము ఒక ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుతున్నాం. షూటింగ్ కు కావాల్సిన అనుమతులు అన్నీ ఉన్నాయి.  ఈ ఘటనపై ఎవరికి ఫిర్యాదు చేయాలి?  పోలీసులు కూడా గూండాలతో కలిసిపోయి ఉన్నారు" అని ఆరోపించారు.   అయితే ఆ దుండగులు ఎవరు.. ఎందుకు ఈ 'ఫిక్సర్' టీమ్ పై దాడికి పాల్పడ్డారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

For Video Click Here

Tags:    

Similar News