బాడీ హ‌గ్గింగ్ దుస్తుల్లో కిల్ చేస్తున్న నోరా

నోరా ఫ‌తేహి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాహుబ‌లి మ‌నోహ‌రిగా కుర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ. ఎన్టీఆర్ `టెంప‌ర్`లో ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించింది.;

Update: 2025-12-27 05:49 GMT

నోరా ఫ‌తేహి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాహుబ‌లి మ‌నోహ‌రిగా కుర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ. ఎన్టీఆర్ `టెంప‌ర్`లో ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించింది. ఇటీవ‌లి కాలంలో కొన్ని సింగిల్ ఆల్బ‌మ్స్ తో యువ‌త‌రం హృద‌యాల‌ను గెలుచుకుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంది. తాజాగా మ‌రోసారి నోరా చెల‌రేగి ఫోజులిచ్చిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు పెంచుతోంది.




తాజా ఫోటోషూట్ కోసం నోరా భారీత‌నం నిండిన లెద‌ర్ బాడీ హ‌గ్గింగ్ దుస్తుల‌ను ధరించింది. డేవిడ్ కోమా బ్రాండ్ దుస్తులు ఎంతో స్టైలిష్ గా త‌న‌కోస‌మే ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన‌ట్టుగా కుదిరాయి. నోరా ఈ డార్క్ బ్రౌన్ క‌ల‌ర్ లెద‌ర్ దుస్తుల్లో సంథింగ్ స్పెష‌ల్ గా ఉంది అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇటీవ‌ల ఈ బ్యూటీ డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగా కొన‌సాగుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.




జైల‌ర్ 2లో నోరా ఐట‌మ్

ర‌జనీకాంత్ `జైలర్`లో `కావాలా` ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా నృత్యం, గుబులు పుట్టించే భంగిమ‌లు మ‌తులు చెడ‌గొట్టాయి. `కావాలా..` పాటలో త‌మ‌న్నా స్టెప్పుల్ని ప్ర‌తి ఈవెంట్లో, డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌ల‌లో, ఆన్ లైన్ వీడియోల‌లో చాలామంది రీక్రియేట్ చేసారు. పార్ట్ 1లో స్పెష‌ల్ నంబ‌ర్ క్రియేట్ చేసిన బ‌జ్ దృష్ట్యా, నెల్స‌న్ దిలీప్ కుమార్ జైల‌ర్ 2లోను అలాంటి ఒక స్పెష‌ల్ నంబ‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఈసారి బాహుబ‌లి మ‌నోహ‌రి నోరా ఫ‌తేహి ఈ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించ‌నుంది. `జైల‌ర్ 2` కోసం నోరా ఫ‌తేహి స్పెష‌ల్ ట్రీట్ త‌మ‌న్నాను మించి ఉంటుంద‌ని చెబుతున్నారు. దీనికోసం నెల్స‌న్ దిలీప్ కుమార్ ఎంపిక చేసుకున్న లిరిక్ కానీ, బీట్ కానీ `కావాలా..`ను మించి ఆక‌ట్టుకుంటాయి. దానికి నోరా ఫ‌తేహి ప్ర‌త్యేక నృత్య భంగిమ‌లు యూత్ లో ఉత్సాహం నింపుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.




నోరా ఫతేహి పాట అంత‌కుమించి అనే రేంజులో హృద‌యాల‌ను కొల్ల‌గొడుతుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంత‌ర్జాతీయ ఈవెంట్ల‌లో, ఆన్ లైన్ వైర‌ల్ పాట‌ల్లో సూపర్ హిట్ నంబర్లతో అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్న నోరా ఫతేహి, ఇప్పుడు గ్లోబల్ పాప్ కల్చర్ లో ప్ర‌త్యేక క్రేజ్ ను తెచ్చుకుంది. నోరా ఫతేహి కెరీర్ జ‌ర్నీలో `జైలర్ 2` మ‌రో ముఖ్య‌ అధ్యాయం అవుతుందని భావిస్తున్నారు.

కార్ యాక్సిడెంట్..

కొద్దిరోజుల క్రితం నోరా ఊహించ‌ని రీతిలో కార్ యాక్సిడెంట్ కి గురైన సంగ‌తి తెలిసిందే. బాగా తాగి ఉన్న ఒక వ్య‌క్తి వేగంగా వ‌చ్చి నోరా కార్‌ని త‌న కార్ తో ఢీకొట్టాడు. దీంతో నోరా త‌ల గ్లాస్ విండోను గుద్దుకుంది. ఈ విష‌యాన్ని నోరా వెల్ల‌డించింది. ప్ర‌మాద స‌మ‌యంలో తాను చాలా భ‌య‌ప‌డ్డాన‌ని చెప్పింది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ఈ ప్ర‌మాదంలో నోరాకు ఏమీ కాలేదు. ఓ ఈవెంట్ కోసం వెళుతూ ఇలా ప్ర‌మాదానికి గురైన విష‌యాన్ని నోరా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News