ప‌ది రోజులకు అన్ని కోట్లు ఇస్తున్నారా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ మూవీలో లీవింగ్ లెజెండ్స్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డం తెలిసిందే.;

Update: 2026-03-08 16:30 GMT

కురుక్షేత్ర యుద్దం, ఆ యుద్ధంలో శ్రీ‌కృష్ణుడి శాపానికి గురైన అశ్వ‌ద్ధామ భూమిపైనే సంచ‌రిస్తున్నాడ‌ని, క‌ల్కి పుట్టే స‌మ‌యానికి తిరిగి బ‌య‌టికి వ‌స్తాడ‌ని, త‌నే ఆయ‌న పుట్ట‌క‌కు సాక్షిగా నిలుస్తాడ‌నే క‌థ‌తో పురాణ ఇతిహాస ఘ‌ట్టాల‌ని, సైన్స్ ఫిక్స్‌కి జ‌త చేసి నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఎపిక్ సైన్స్ ఫిక్ష‌న్ డ్రామా `క‌ల్కి 2898ఏడీAD`. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ మూవీలో లీవింగ్ లెజెండ్స్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌డం తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

2024లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీకి సీక్వెల్‌ని ప్ర‌స్తుతం రూపొందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని సైలెంట్‌గా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మొద‌లు పెట్టేశాడు. ఫ‌స్ట్ పార్ట్‌లో న‌టించిన దీపికా ప‌దుకునే సెకండ్ పార్ట్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డంతో ఆ స్థానంలో స్టార్ లేడీ సాయి ప‌ల్ల‌విని ఫైన‌ల్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా లెజెండ‌రీ యాక్ట‌ర్స్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌ల‌పై కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు.

ప్ర‌తీ రోజు ఈ సీరియ‌ర్ యాక్ట‌ర్స్ ఓవ‌ర్ టైమ్ షూటింగ్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఉద‌యం మొద‌లైన షూటింగ్ ఎలాంటి బాడీ డ‌బుల్ లేకుండా రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు నిర్విరామంగా జ‌రుగుతోంద‌ట. సీనియ‌ర్ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ‌స్ట్ పార్ట్‌లో హంగామా చేసిన‌ట్టుగానే యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో పార్ట్ 2లోనూ అద‌ర‌గొట్ట‌నున్నార‌ట‌. ఈ నేఫ‌థ్యంలోనే ఆయ‌న‌పై కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్నార‌ని, అయితే వాటి కోసం అమితాబ్ బాడీ డ‌బుల్‌ని ఎక్క‌డా వాడ‌టం లేద‌ట‌.

స్వ‌యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అమితాబ్ బ‌చ్చ‌న్ పాల్గొని న‌టిస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఈ వ‌య‌సులో ఎలాంటి బాడీ డ‌బుల్ ని యూజ్ చేయ‌కుండా యాక్ష‌న్ సీన్‌ల‌ల్లో న‌టిస్తుండ‌టం టీమ్‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్ట్ 1లో సుప్రీమ్ యాష్కిన్‌గా చాలా త‌క్కువ స‌మ‌య‌మే క‌నిపించి అంద‌దిని స‌ర్‌ప్రైజ్ చేసిన క‌మ‌ల్ హాస‌న్ క్యారెక్ట‌ర్ నిడివి పార్ట్ 2లో మాత్రంఎక్కువే ఉంటుంద‌ని, ఆయ‌న క్యారెక్ట‌రే ప్ర‌ధానంగా సాగుతుంద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ మూవీ కోసం రూ.150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

త‌మిళ సీనియ‌ర్ న‌టుడు యోగిసేతు క‌ల్కి మూవీ కోసం తీసుకుంటున్న పారితోషిం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `క‌మ‌ల్ హాస‌న్ స‌ర్ భార‌త‌దేశంలోనే అత్య‌ధిక పారితోషికం పొందిన న‌టుడు. `క‌ల్కి 2898ఏడీAD`కి 20 రోజుల కాల్షీట్స్‌కి గానూ రూ.150 కోట్లు. క‌మ‌ల్ సార్ పుట్టిన రోజున నేను ఈ విష‌యాన్ని చెప్పాను. వెంట‌నే ఆయ‌న న‌న్ను నిర్మాత అశ్వ‌నీద‌త్‌కు ప‌రిచ‌యం చేశారు. నేను ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాను. అయితే ఆయ‌న 20 రోజుల‌కు కాదు 10 రోజుల‌కు మాత్ర‌మే అని చెప్పారు` అని వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.



Tags:    

Similar News